Anasuya Bhardwaj : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం లేదు. అందం, మాటలతో మెస్మరైజింగ్ చేస్తూ స్మాల్ స్ర్కీన్ ను ఒక దశలో ఏలిందనే చెప్పవచ్చు. సొగసరిగా ఉన్న ఆమెను చూసేందుకే చాలా మంది జబర్ధస్త్ షో చూశారంటే అతిశయోక్తి కాదు. అంతలా బుల్లి తెరపై ముద్ర వేసింది. ఇక వెండితెరపైకి వెళ్లాలనుకున్న ఆమె కల మెల్ల మెల్లగా నెరవేరింది.
సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తున్న ఆమె మంచి మంచి పాత్రల్లో కనిపించి తన నటనతో మెప్పిస్తోంది. ముఖ్యమంగా సుకుమార్ సినిమాలో ఆమె పాత్రకు బాగానే ప్రాధాన్యత ఇస్తున్నాడు. రంగస్థలంలో రంగమ్మత్తగా, పుష్పలో శ్రీను భార్యగా ఎక్కువ నిడివి కనిపించే పాత్రలు ఇస్తున్నాడు. ఆమె కూడా ఈ పాత్రల్లో అలవోకగా దూరి నటిస్తోంది.
గతంలో కొన్ని వివాదాల్లో మునిగి తేలిన ఆమె, ఈ మధ్యే బయటపడింది. రౌడీ బాయ్ దేవరకొండ విజయ్ సినిమా అర్జున్ రెడ్డి నుంచి వీరిద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి. దేవరకొండ ఫ్యాన్స్ కూడా అనసూయను బాగానే ఇబ్బంది పెట్టారు. కానీ ఇటీవల ఈ వివాదాలకు ఆమె స్వస్తి తెలిపింది. సామరస్యంగా ఉంటామని ట్విటర్, ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే..
స్టైలిష్ బ్లూ కో-ఆర్డ్ సెట్ ధరించి బాల్కనీలో కాఫీ తాగుతూ అనసూయ భరద్వాజ్ అప్రయత్నంగా అందాలను ఆరబోసింది.
ఆకట్టుకునే క్యాజువల్ లుక్ తో క్యూట్ నెస్, ఆకర్షణను మేళవించి, తన కిల్లర్ స్మైల్ ను కెమెరాకు చూపించింది. ఏ మాత్రం మొహమాటం లేకుండా, ప్రకాశవంతంగా కనిపించే అనసూయ అప్రయత్నంగా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తో కనిపించింది. సొగసును, నిర్లిప్త దృక్పథాన్ని మేళవించడంలో ఆమె భంగిమ ఒక మాస్టర్ క్లాస్.