Anand Mahindra : కల్కి డైరెక్టర్ పై ఆనంద్ మహీంద్ర ప్రశంసల వర్షం
Anand Mahindra : యావత్ భారతదేశం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పెద్ద చర్చే నడుస్తోంది. రీసెంట్ గా చిత్ర బృందం రామోజీఫిల్మ్ సిటీలో పెద్ద ఈవెంట్ నిర్వహించి భైరవ బుజ్జిని పరిచయం చేశారు. ఈ సమయంలో విడుదల చేసిన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల బుజ్జి కోసం నిర్వహించిన ఈవెంట్లో అభిమానులకు పరిచయం చేసేందుకు బుజ్జిని స్వయంగా డ్రైవ్ చేస్తూ తీసుకువచ్చాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డిఫరెంట్ లుక్లో స్టైలీష్ గా ఉన్న బుజ్జిని చూసి అంతా ఆశ్చర్యపోయారు అడ్వాన్స్ డ్ టెక్నాలజీని వినియోగిస్తూ రూపొందించిన బుజ్జి కారుకు అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. బుజ్జి రివీల్ తర్వాత కల్కి ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. దాంతో పాటు ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తుండడంతో.. సినిమాలో చాలా రకాల వాహనాలను వాడినట్లు తెలుస్తోంది. వీటన్నింటి నడుమ అసలు సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందనే సందేహాలు జనాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బుజ్జికి సంబంధించిన స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కల్కి 2898 ఏడీ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన్ను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. గతంలో నాగ్ అశ్విన్ పెట్టిన ట్విట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ.. “నిజానికి సరదా సంగతులు ట్విట్టర్ లోనే కనిపిస్తాయి. నాగ్ అశ్విన్.. అతడి టీమ్ గొప్పగా ఆలోచించడానికి భయపడరు. వారిని చూస్తుంటే గర్వంగా ఉంది. అడ్వాన్స్ డ్ టెక్నాలజీ వాహనాలు తయారు చేయడంలో కల్కి చిత్రబృందానికి చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్ సహయపడుతుంది. బుజ్జి వాహనం రెండు మహీంద్రా ఇ- మోటర్లతో నడుస్తుంది. జయం ఆటోమోటివ్స్ కూడా ఈ వెహికల్ రూపొందించడంలో భాగమైంది ” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా ట్వీట్ నెట్టింట వైరలవుతుంది. ఆయన చేసిన ట్వీట్ పై నాగ్ అశ్విన్ స్పందించారు.. ‘సాధ్యం అనుకున్న కలను సుసాధ్యం చేశారు. ధన్యవాదాలు’ అంటూ రిప్లై ఇవ్వగా.. ‘కలలు కనడం మానొద్దు.. ‘ అంటూ మహీంద్రా రీ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్టర్ ముచ్చట నెట్టింట్లో వైరలవుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.400కోట్లతో తెరకెక్కిస్తున్న కల్కి చిత్రాన్ని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.