Sanjay Kumar : తెలంగాణ ఎన్నికలపై సీఎస్‌డీఎస్ సంజయ్ కుమార్ విశ్లేషణ

CSDS Sanjay Kumar

CSDS Sanjay Kumar

Sanjay Kumar : తెలంగాణలో ఇంకా రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. అభ్యర్థుల భవితవ్యం తేలేందుకు మరో నాలుగు రోజుల సమయం ఉంది. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించగా అందులో కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. తెలంగాణలో పూర్తయితే ఆదివారం లెక్కింపు ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆలోచనలు సాధారణ ఓటరు నుంచి కార్పొరేట్ ప్రముఖుల వరకు ఆసక్తి నెలకొంది.

తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందో అంశంపై సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) ప్రొఫెసర్, కో డైరెక్టర్ ఆఫ్ లోక్‌నీతి సంజయ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో వివరించారు. అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య ఓట్ల శాతాన్ని గెలుపు అవకాశాలను వివరించారు. గెలుపు అంటే ఒక్క ప్రాపగండా కాదని ఆయన చెప్పుకచ్చారు.

‘తెలంగాణలో రెండు ప్రధాన పార్టీలు గెలుపుకోసం పోరాడుతున్నాయి. 1. బీఆర్ఎస్, 2. కాంగ్రెస్. అయితే తెలంగాణ ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే గత ఎన్నికల్లో (2018) ఈ రెండు పార్టీల మధ్య 19 శాతం ఓట్ షేరింగ్ ఉంది. అంటే 19 శాతం ఓట్లతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.

అయితే.. ఇంత పెద్ద మొత్తంలో ఓటింగ్ శాతాన్ని తన వైపునకు తిప్పుకోవడం కాంగ్రెస్ కు సాధ్యం కాని పని. ఈ ఐదేళ్లలో మాహా అంటే 6 నుంచి 7 శాతం వరకు ఓట్లను తమ వైపునకు తిప్పుకుంటారు. అందులోనే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉన్నా అది సాధ్యం కాదని నా అభిప్రాయం ఈ 19 శాతం ఓట్లను కాంగ్రెస్ పార్టీ దాటాలంటే సాధ్యం కాని పని’ అని సంపయ్ కుమార్ తెలిపారు. ఈయన ప్రిడిక్షన్ పరిశీలిస్తే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

TAGS