Nagababu : అన్న కోసం అనకాపల్లి.. పట్టుపడుతున్న పవన్.. ఇప్పటికే అక్కడ పోటాపోటీ!

Nagababu contest from Anakapalli for pawan
Nagababu : టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే అధినేతలు ఇద్దరూ ఓ అంచనాకు వచ్చారు. కొన్ని స్థానాల కోసం పోటాపోటీ ఉన్నా.. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఏదో ఒకటి క్లియర్ చేసి.. ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. ఈక్రమంలోనే బీజేపీ తమతో కలిసివస్తుందా లేదా అనే విషయాలపై ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నారు.
ఇక టీడీపీతో పొత్తు ప్రస్తావన లేనప్పుడు తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని పార్టీకి మాత్రమే పనిచేస్తానని నాగబాబు ప్రకటించారు. ఇప్పుడు టీడీపీతో పొత్తుతో ఎక్కడ పోటీ చేసినా గెలుస్తామన్న నమ్మకం ఏర్పడడంతో ఆయన మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. అనకాపల్లి నుంచి నాగబాబును పోటీ చేయించాలని పవన్ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే కాకినాడ, మచిలీపట్నం స్థానాలను జనసేనకు కేటాయించారు. ఆ స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. వైసీపీ నుంచి వచ్చిన బాలశౌరికి మచిలీపట్నం, సాన సతీశ్ కుమార్ కు కాకినాడ ఇస్తారని అంటున్నారు.
తాజాగా అనకాపల్లి కూడా కావాలని పవన్ అడుగుతున్నట్లుగా చెబుతున్నారు. అనకాపల్లి కోసం టీడీపీలోనే చాలా పోటీ ఉంది. బైరి దిలీప్ చక్రవర్తి అనే నేతకు చంద్రబాబు సీటు కన్ఫర్మ్ చేశారని అంటున్నారు. కానీ చింతకాయల విజయ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నాగబాబు రంగంలోకి వస్తున్నారు. దీంతో అనకాపల్లి వ్యవహారం హాట్ హాట్ గా మారనుంది. నాగబాబు ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. ఆయనకు సోదరుడు హామీ ఇచ్చి ఉంటారన్న చర్చ నడుస్తోంది.
గతంలో నర్సాపురం నుంచి నాగబాబు పోటీ చేశారు. నర్సాపురం పొత్తుల్లో ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ నుంచి రఘురామ పోటీ చేస్తారు. అందుకే అక్కడ చాన్స్ లేదు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి మాత్రం ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఎవరు పోటీ చేసినా గెలవడం లేదు. ఈసారి పవన్ తో పాటు నాగబాబు కూడా ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని తహతహలాడుతున్నారు. మరి ఆశలు నెరవేరుతాయా లేదా వేచి చూడాల్సిందే.