Anahat Singh : కోస్టా నార్త్ కోస్ట్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అనాహత్ సింగ్  

Anahat Singh

Anahat Singh

Anahat Singh : టీనేజ్ స్క్వాష్ సంచలనం అనాహత్ సింగ్ ఆదివారం ఆస్ట్రేలియాలోని కాఫ్స్ హార్బర్‌లో జరిగిన కోస్టా నార్త్ కోస్ట్ ఓపెన్ 2024లో మహిళల సింగిల్స్ ను దగ్గించుకుంది. ఈ సంవత్సరం తన ఆరవ పీఎస్ఏ ఛాలెంజర్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టోర్నీలో మూడో సీడ్‌గా నిలిచిన 16 ఏళ్ల ప్లేయర్ జపాన్‌కు చెందిన ఆరో సీడ్ అకారి మిడోరికావాను 3-0 (11-6, 11-6, 11-7)తో వరుస గేముల్లో ఓడించింది.  సెమీ-ఫైనల్స్‌లో ఆమె హాంకాంగ్‌కు చెందిన ఏడో సీడ్ కిర్‌స్టీ వాంగ్‌ను 3-1 (11-5, 7-11, 11-7, 11-9)తో ఓడించింది. గతంలో హాంకాంగ్‌కు చెందిన బోబో లామ్, హెలెన్ టాంగ్‌లను ఓడించింది.

హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో మహిళల జట్టు , మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లు రెండింటిలోనూ కాంస్య పతకాలు సాధించిన అనాహత్ తన సీడింగ్ కారణంగా తొలి రౌండ్‌లో బై అందుకుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో జేఎస్ డబ్ల్యూ విల్లింగ్‌డన్ లిటిల్ మాస్టర్స్, సీనియర్ టోర్నమెంట్ టైటిల్‌ను గెలుచుకుంది. ఏప్రిల్‌లో హమ్‌దార్డ్ స్క్వాష్టర్స్ నార్తర్న్ స్లామ్ పీఎస్ఏ ఛాలెంజర్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆగస్టులో జరిగిన రిలయన్స్ పీఎస్ఏ ఛాలెంజ్ 3 టోర్నమెంట్‌ను గెలుచుకోవడంతో పాటు, జూన్,  ఆగస్టులలో వరుసగా హెచ్‌సిఎల్ స్క్వాష్ టూర్‌లో చెన్నై,  కోల్‌కతా లెగ్‌లలో కూడా ఆమె విజయం సాధించింది.

TAGS