JAISW News Telugu

Ana Obregon : కొడుకు వీర్యంతో బిడ్డకు జననం..

Ana Obregon

Ana Obregon Daughter anita

Ana Obregon : అనా ఒబ్రెగాన్ తన బిడ్డ తండ్రి కావాలనే కోరికను నెరవేర్చింది. చనిపోయిన తన కొడుకు తేజస్సు (వీర్యం)ను తీసుకొని ఆమె అనిత అనే పాపకు జన్మనిచ్చింది. రీసెంట్ గా అనిత బర్త్ డే సందర్భంగా అనా తన ఇన్ స్టాలో ఫొటోలను షేర్ చేసి సర్ప్రైజ్ చేసింది.

సరోగసీ ద్వారా 2023లో ఆడ శిశువుకు జన్మనిచ్చిన 69 ఏళ్ల అనా ఒబ్రెగాన్  అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ పుట్టిన బిడ్డకు తండ్రి మరణించిన తన కొడుకే కావడం విషేశం. తన కొడుకు అలెస్ లెక్వియో క్యాన్సర్ తో చనిపోయాడు. ఆయనకు తండ్రి కావాలనే కోరిక ఉందట. ఆ కలను సాకారం చేసుకునేందుకు తన కుమారుడి నుంచి వీర్య నమూనాను ఉపయోగించినట్లు ఒబ్రెగాన్ వెల్లడించారు. ఏదో ఒక రోజు తండ్రి కావాలనే ఆశతో లెక్వియో తన వీర్యాన్ని భద్రపరుచుకున్నాడని, కానీ ఆ యువకుడికి విధి వేరే మలుపు తిరిగిందని ఆమె తెలిపింది.

27 సంవత్సరాల వయస్సులో, లెక్వియో క్యాన్సర్ తో మరణించాడు. అతని తల్లి, స్పానిష్ నటి అనా ఒబ్రెగాన్ అతని చివరి కోరికను నెరవేర్చింది. 2023 మార్చిలో అనిత అనే కుమార్తెను ఈ లోకంలోకి ఆహ్వానించింది. అనితకు తన దివంగత కుమారుడు లెక్వియోతో స్పష్టమైన పోలిక ఉందని ఒబ్రెగాన్ పేర్కొన్నారు.

ఇన్ స్టాలో షేర్..

ఇన్ స్టాలో అనిత పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్ట్ షేర్ చేసిన ఒబ్రెగాన్ .. ‘అనిత, ఈ రోజుతో నీకు ఏడాది. లోతైన చీకట్లో మునిగి, అపారమైన బాధతో ఉన్న నా హృదయాన్ని కాంతితో నింపినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. మీ చిరునవ్వుకు, మీ బుగ్గలకు, మీ క్రాల్స్ కు మరియు మొదటి అడుగులకు ధన్యవాదాలు. మీ నాన్న నన్ను ఎంత ప్రేమగా చూశారో నన్ను కూడా అంతే ప్రేమతో చూసినందుకు ధన్యవాదాలు. నన్ను ఎవరూ అలా చూడలేదు అని ఆమె చిన్నారికి చెప్పింది.

Exit mobile version