JAISW News Telugu

Australia Vs Bangladesh : బంగ్లాదేశ్  చెమటోడ్చిన దక్కని ఫలితం

Australia Vs Bangladesh

Australia Vs Bangladesh

Australia Vs Bangladesh : ఆస్ట్రేలియా జట్టు, బంగ్లాదేశ్ జట్టు ప్రపంచ కప్ సాధించడానికి హోరా హోరీగా పోరాడుతున్నాయి. ఎంతయినా ఆస్ట్రేలియా జట్టును ఢీకొట్టాలంటే సాధ్యమయ్యే పనికాదు. యోధాను, యోధులు ఉన్నారు. వారందరిని ఎదుర్కొని గట్టెక్కాలంటే ఎంతో కష్టపడాలి. ఆస్ట్రేలియా జట్టు పై విజయం సాధించడానికి బంగ్లాదేశ్ జట్టు ఆటగాళ్లు చెమటోడ్చారు. అయినా ఫలితం కానరాలేదు. 

టీ – 20 ప్రపంచ కప్ సూపర్-8 పోటీలో భాగంగా బంగ్లాదేశ్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాల్ల ఆటతీరు ఎంతో ఆకట్టుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ను ఆస్ట్రేలియా జట్టు ఎంచుకుంది. బంగ్లాదేశ్ బాట్స్  మెన్ లను ఆస్ట్రేలియా బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన మొదటి ఓవర్ లోనే ఓపెనర్ తంజీద్ హాసన్ డక్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ కూడా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ వేసిన బంతికి అవుట్ అయ్యాడు. దింతో బంగ్లాదేశ్ స్కోర్ 20 ఓవర్లలో ఎనిమిది మంది అవుట్ కావడంతో 140 పరుగులకే బంగ్లాదేశ్ జట్టు పరిమితం అయ్యింది. 

టీ20 వరల్డ్ కప్‌లో  ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్‌ సాధించాడు. కమిన్స్ వేసిన బంతులకు మహ్మదుల్లా, మెహదీ హసన్, తౌహిద్ హృదయ్‌లు ఒకరి తరువాత ఒకరు ఔటయ్యారు. ఈ పోటీలో కమిన్స్ రికార్డ్ సృష్టించాడు. ఇన్నింగ్స్ లో 18 వ ఓవర్ లో కమిన్స్ మరోసారి రంగంలోకి దిగారు. చివరి ఓవర్ లో చివరి రెండు బంతులు వేసి మహ్మదుల్లా, మెహదీ హసన్‌లను అవుట్ చేసాడు. 

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ లోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు ఆటగాళ్లకు తొలి ఓవర్ లోనే ఎదురుదెబ్బ తగిలింది. తోలి ఓవర్ లోనే తంజిద్ హసన్‌ డకౌట్‌ అయ్యాడు. మరో ఓపెనర్ లిట్టన్ దాస్ 16, కెప్టెన్ షంటో  41 పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. బంగ్లాదేశ్ దూకుడుకు ఆస్ట్రేలియా బౌలర్లు అడ్డుకట్ట వేయడంతో ఫలితం తేలిపోయింది. 

లిట్టన్ దాస్‌ను 9వ ఓవర్లో వచ్చిన ఆడమ్ జంపా బౌల్డ్ చేశాడు. రిషద్ హొస్సేన్‌ను.పదో ఓవర్లో మ్యాక్స్‌వెల్ ఔట్ చేశాడు. షకీబ్ అల్ హసన్ ఎనిమిది పరుగులకే పెవిలియన్ కు చేరాడు. దింతో బంగ్లాదేశ్ 16.1 ఓవర్లలో 103 పరుగులకే 5 వికెట్లు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టోయినిస్ వేసిన ఓవర్లో వరుసగా రెండు సిక్సులు బాదడంతో బంగ్లాదేశ్ ఆటగాళ్ల లో ఆశలు చిగురించాయి. 160 పైబడి పరుగులు సాధిండం ఖాయమనిపించింది. కెప్టెన్ రంగంలోకి దిగడంతో చివరి ఓవర్ లో బంగ్లాదేశ్ జట్టు కుప్పకూలిపోయింది. ఎనిమిది వికెట్ల నష్టానికి 140 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Exit mobile version