Oscar-2025 award : ఆస్కార్-2025 అవార్డులో రేసులో ఎవరూ ఊహించని ఇండియన్ సినిమా..

laaapata ladies

Oscar-2025 award race laaapata ladies

Oscar-2025 award : ఆస్కార్ 2025కి  భారతీయ సినిమా ఎంపికైంది. దర్శకురాలు కిరణ్ రావు తెరకెక్కించిన చిత్రం ‘లాపతా లేడీస్’ ఆస్కార్ రేసులో ఉన్నది. రణబీర్ కపూర్ ‘యానిమల్’, కార్తీక్ ఆర్యన్ ‘చందు ఛాంపియన్’, ప్రభాస్ ‘కల్కి 2898 AD’, మలయాళ చిత్రం ‘ఆటం’, రాజ్‌కుమార్ రావ్ ‘శ్రీకాంత్’ తదితర చిత్రాలతో పోటీపడి ఎట్టకేలకు ఆస్కార్‌లో చోటు దక్కించుకుంది. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ నిర్మించారు. చిన్న సినిమాగా వచ్చిన ‘లాపతా లేడీస్’  ప్రేక్షాకదరణను పొందడంతో పాటు కలెక్షన్లు కూడా సాధించింది. సీజేఐ చంద్రచూడ్ తో పాటు పలువురు ప్రముఖుల కోసం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు.

ఈ సంవత్సరం  హను-మాన్, కల్కి, యానిమల్, చందు ఛాంపియన్, సామ్ బహదూర్, స్వాతంత్ర్య వీర్ సావర్కర్, గుడ్ లక్, ఘరత్ గణపతి, మైదాన్, జోరం, కొట్టుకాళి, జామా, ఆర్టికల్ 370, ఆటం, ఆడుజీవితం వంటి 29 చిత్రాలను ఆస్కార్ పోటీలకు పంపారు. అయితే ఆ చిత్రాలేవి చోటు దక్కించుకోలేకపోయాయి. ‘లాపతా లేడీస్’ ఆస్కార్ బరిలో నిలవగా జ్యూరీలో తంగలన్, వాజాయ్, ఉల్లోజుక్కు,  శ్రీకాంత్ సినిమాలు ఉన్నాయి.  ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రవి కొట్టారకర జ్యూరీ సభ్యులను మీడియాకు పరిచయం చేశారు. చిత్ర నిర్మాత జాహ్ను బారువా జ్యూరీ చైర్మన్‌గా ఉన్నారు.

గతేడాది ఆస్కార్ బరిలో బాలీవుడ్‌  సినిమాలు
గత సంవత్సరం, జూడ్ ఆంథోనీ జోసెఫ్ చిత్రం ‘2018’  96వ అకాడమీ అవార్డుల షార్ట్‌లిస్ట్‌లో చేరలేకపోయింది. 95వ అవార్డులో మాత్రం రాజమౌళి చిత్రం ఆర్ఆర్ ఆర్ లోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ను గెలుచుకుంది.

డాక్యుమెంటరీకి ఆస్కార్‌  
కార్తికీ గోన్సాల్వేస్,  గునీత్ మోంగాల డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును గెలుచుకుంది. షౌనక్ సేన్ ‘ఆల్ దట్ బ్రీత్స్’ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌గా ఎంపికైంది.

చివరి దశలో నిష్క్రమించిన లగాన్
షార్ట్‌లిస్ట్‌లో చేరిన చివరి భారతీయ చలనచిత్రం అమీర్ ఖాన్-అశుతోష్ గోవారికర్ ల ‘లగాన్’ (2001). ఇది 74వ అకాడమీ అవార్డ్స్‌లో ‘నో మ్యాన్స్ ల్యాండ్’ చేతిలో ఓడిపోయి చివరి నిమిషంలో బరిలో నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

TAGS