Rajinikanth health : సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై కీలక అప్ డేట్

Rajinikanth health Updates
Rajinikanth health : సౌత సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం అర్థరాత్రి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న రజనీకాంత్‌కు వైద్యులు సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం వైద్యులు ఆయన పొత్తికడుపులో స్టెంట్లు వేసినట్లు తెలుస్తున్నది. ఆపరషేషన్ విజయవంతమైందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉన్నట్లు సమాచారం. మరో మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రజనీ కాంత్ ఆరోగ్యంపై ఆయన భార్య లతా కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుట పడిందని వెల్లడించాడు. అయితే రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు తెలియడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తలైవా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ ‘వేట్టయాన్’, ‘కూలీ’ సినిమాల్లో నటిస్తున్నారు. ‘వేట్టయాన్’ సినిమా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమా ఆడియో వేడుకలో రజినికాంత్ ఉత్సాహంగా కనిపించాడు. అనిరుధ్‌తో కలిసి సరదాగా స్టెప్పులు కూడా వేశారు.
ఇక రజినీకాంత్ హాస్పిటల్ చేరిన విషయం తెలియడంతో పలువురు ప్రముఖులు స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రజినీ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు.