AMUL DAIRY : ఐరోపావైపు భారత్ కంపెనీ చూపు.. వేలకోట్ల టర్నోవర్ తో మరింత దూకుడు..?

AMUL DAIRY

AMUL DAIRY

AMUL DAIRY : భారత్ తర్వాత అమెరికాకు విస్తరించిన  ఓ గుజరాతీ పాలవ్యాపార సంస్థ ఇప్పుడు ఐరోపా వైపు దృష్టి పెట్టింది. అమెరికాలో వేల కోట్ల టర్నోవర్ సాధించి వ్యాపార విస్తరణకు అడుగులు వేస్తున్నది. భారత మార్కెట్లో పాలవ్యాపారంలో అగ్రశ్రేణిలో కొనసాగుతున్న ఈ డెయిరీ కంపెనీ 1946లొ మొదలైంది. గుజరాత్ కు చెంది ఈ పాల వ్యాపార సంస్థ ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. కమీషన్ బేస్డ్ గా తన వ్యాపారం నిర్వహిస్తుంది. ఇప్పుడు అమెరికాలో కీలకంగా మారిన ఈ డెయిరీ కంపెనీ ఇక యూరప్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నది.

అమూల్ ఉత్పత్తులను అమెరికాలో విడుదల చేసిన అనంతరం యూరోపియన్ మార్కెట్ లోకి వెళ్తామని గుజరాత్ కో ఆఫరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తెలిపింది. ఈ మేరకు ఈ సంస్థ ఎండీ జయేన్ ఎస్ మెహతా ఒక కీలక ప్రకటన చేశారు. ఈ ఫెడరేషన్ పాల ఉత్పత్తులను అమూల్ బ్రాండ్ కింద విక్రయిస్తున్నది. ఈ నెలాఖరులోగా యూరప్ లో అడుగుపెడుతామని ఆయన చెప్పారు. ఇందుకు గాను ముందుగా స్పెయిన్ లో తొలి స్టోర్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత యూరప్ లోని మిగతా దేశాలకు విస్తరిస్తామని స్పష్టం చేశారు.

అమూల్ కంపెనీ ప్రస్తుతం భారత్ లో వేలకోట్ల టర్నోవర్ ను సాధిస్తున్నది. 10 కోట్లకు పైగా కుటుంబాలకు అమూల్ బ్రాండ్ పాలు అందుతున్నట్లుగా సంస్థ తెలిపింది. సుమారు 36 లక్షల మంది రైతులు ఈ బ్రాండ్ కు పాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలోనూ నాలుగు రకాల పాల బ్రాండ్లను అమూల్ విక్రయిస్తున్నది. ఇక యూరప్ స్టోర్స్ లలోనూ తమ ఉత్పత్తులను విక్రయించేందుకు సిద్ధమవుతున్నది. ఎక్కువ మంది ఉత్పత్తిదారులు ఈ సంస్థకు చిన్న, సన్నకారు రైతులు కావడమే విశేషం. యూరప్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి పెద్ద దేశాల్లోనూ ఈ డెయిరీ స్టోర్స్ ప్రారంభిస్తే, కంపెనీ విలువ మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఎండీ మెహతా అభిప్రాయపడ్డారు. ఒక భారత్ కంపెనీ ఈ స్థాయిలో డెయిరీ ఉత్పత్తులను అమెరికా, యూరప్ దేశాలకు దిగుమతి చేయడం గ్రేట్  అంటూ అభిప్రాయపడుతున్నారు.

TAGS