Sharmila : ‘అమ్మతోడు’ మా కుటుంబం చీలడానికి కారణం జగనే.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
Sharmila : రాజకీయాల్లో బాంధవ్యాలు, బంధువులు ఉండరు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్న నానుడి రాజకీయాల్లో బాగా పనికొస్తుంది. రాజకీయాల్లో సెంటిమెంట్లు ఉండవు..ఓన్లీ సీట్ల సమరాలే ఉంటాయి. రక్తసంబంధాలు ఉండవు.. రాజకీయ సంబంధాలు ఉంటాయి. రాజకీయాల్లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఆ దేవుడు కూడా చెప్పలేడు. ఇక్కడ ఎవరి ఆట వారిదే.
తాజాగా కాంగ్రెస్ స్టేట్ చీఫ్ షర్మిల తన అన్న సీఎం జగన్ పై విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. ఆయన మాట్లాడే ప్రతీ మాటను గుర్తుపెట్టుకుని మరీ టార్గెట్ చేస్తున్నారు. రీసెంట్ గా తిరుపతిలో వైఎస్ జగన్ చేసిన కామెంట్లను కాకినాడ జిల్లాలో షర్మిల ఘాటుగా తిప్పికొట్టారు. ‘‘కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని, నా కుటుంబాన్ని చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు జగన్ అన్న గారు’’ అంటూ సెటైర్ వేశారు. ‘‘దేవుడే గుణపాఠం చెప్తారట’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి చెందకుండా దయనీయ స్థితిలో ఉందంటే కారణం చంద్రబాబు, జగన్ అన్నగారే అన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అన్నగారే. దీనికి సాక్ష్యం దేవుడు. దీనికి సాక్ష్యం నా తల్లి, వైఎస్ఆర్ భార్య విజయమ్మ. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం’’ అన్నారు షర్మిల.
‘‘జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందిలో ఉంటే 18 మంది రాజీనామాలు చేసి జగన్ అన్న గారి వైపు నిలబడితే, అధికారంలోకి వచ్చాక మంత్రులను చేస్తా అన్నారు. ఇవాళ వాళ్లలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు వాళ్లు రాజీనామాలు చేస్తే అమ్మ, నేను వాళ్ల కోసం తిరిగాం. వాళ్ల గెలుపు కోసం పాటుపడ్డాం.. గెలిపించాం. వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు. నా ఇంటిని, నా పిల్లలను పక్కన పెట్టి.. ఎండనకా, వాననకా రోడ్ల మీదనే ఉన్నా.. ఆ తర్వాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కదా అని ఆ యాత్రను కూడా చేశా.. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశా.. అలాగే గత ఎన్నికల్లో బైబై బాబు అంటూ ఊరూరూ తిరిగా.. దేశంలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ క్యాంపెయిన్ చేశా.. వైసీపీని గెలిపించా.. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు వేరే మనిషిలా మారిపోయారు’’ అని షర్మిల మండిపడ్డారు.