JAISW News Telugu

Amitabh Bachchan:ముంబై జ‌ట్టుకి అమితాబ్..శ్రీ‌న‌గ‌ర్ జ‌ట్టుకి అక్ష‌య్..

Amitabh Bachchan:భార‌త‌దేశంలో ఐపీఎల్ సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. 20 ఓవ‌ర్ల‌తో పొట్టి క్రికెట్ ఫార్మాట్ ఎంతో పెద్ద విజ‌యం సాధించింది. ఇప్పుడు ఈ ఫార్మాట్ ని అనుస‌రిస్తూ.. స్ట్రీట్ ట్యాలెంట్ ని ఒడిసిప‌ట్టుకునేందుకు స‌రికొత్త ప్ర‌య‌త్నం మొద‌లైంది. దీని పేరు ISPL . ఇండియ‌న్ స్ట్రీట్ ప్రీమియ‌ర్ లీగ్ అనేది పూర్తి పేరు. ఇది 10 ఓవ‌ర్లతో టి-10 మ్యాచ్ ఫార్మాట్. ఇందులో టెన్నిస్ బాల్ తో ఆడ‌తారు. ఐఎస్‌పిఎల్ ఇండియా తొలి టెన్నిస్ బాల్ T10 క్రికెట్ టోర్నీ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. ఇందులో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, శ్రీనగర్ అనే ఆరు జట్లు త‌ల‌ప‌డ‌నుండ‌గా, 19 మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్‌లో ముంబై జ‌ట్టును అమితాబ్ ఛేజిక్కించుకోగా, శ్రీనగర్ జట్టును బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ సొంతం చేసుకున్నాడు. లీగ్ ప్రారంభ ఎడిషన్ మార్చి 2 నుండి మార్చి 9 వరకు ముంబైలో జరగనుంది.

తాజా స‌మాచారం మేర‌కు ఇందులో ఆడ‌నున్న జ‌ట్ల నుంచి ముంబై టీమ్‌ని బిగ్ బి అమితాబ్ ఛేజిక్కించుకున్నారు. స‌హ‌య‌జ‌మాని అయిన ఆయ‌న మాట్లాడుతూ.. ఇలాంటి ఒక విల‌క్ష‌ణ‌మైన ప్ర‌య‌త్నంలో భాగం కావ‌డం ఆనందంగా ఉద్విగ్నంగా ఉంది. వీధుల్లో ప్ర‌తిభ‌కు ప్ర‌ద‌ర్శించిన వారికి నేరుగా టీమిండియాకు ఆడే అవ‌కాశం ఉండ‌వ‌చ్చ‌ని అమితాబ్ అన్నారు. ల‌క్ష‌లాది మంది వీక్షిస్తుండ‌గా త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకునేందుకు ఇది అరుదైన అవ‌కాశం అని కూడా అమితాబ్ అన్నారు.

హోస్టింగ్‌లో నంబ‌ర్-1

అమితాబ్ బచ్చన్ ఇటీవల కౌన్ బనేగా కరోడ్‌పతి వేదిక‌కు జోయా అక్తర్ ది ఆర్చీస్ మొత్తం తారాగణాన్ని స్వాగతించారు. సుహానా ఖాన్, ఖుషీ కపూర్, డాట్, అగస్త్య నందా, యువరాజ్ మెండా, డాట్, మిహిర్ అహుజా, వేదంగ్ రైనా క్విజ్‌లో పాల్గొన్నారు. జోయా అక్తర్ కూడా వారితో రియాలిటీ గేమ్ షోలో చేరారు. సుహానా తన తండ్రి షారుఖ్ ఖాన్‌పై అడిగిన ప్రశ్నకు తప్పుగా సమాధానం చెప్పేవరకు అంతా బాగానే ఉంది. సమాధానం తెలియని సుహానాను చూసి అమితాబ్ బచ్చన్ షాక్ అయ్యాడు.

షారుక్ ఖాన్ ఈ గౌరవాలలో ఏది ఇంకా అందుకోలేదు? ఎంపికలు: (ఎ) పద్మశ్రీ, (బి) లెజియన్ ఆఫ్ హానర్, (సి) ఎల్-ఎటోయిల్ డిఓర్ .. (డి) వోల్పి కప్. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమని సుహానా, వేదంగ్, జోయాలను అడిగారు. సుహానా వెంటనే స్పందిస్తూ.. (ఎ) పద్మశ్రీ! అని అంది. అయితే ఈ సమాధానం తప్పు. అమితాబ్ ఇప్ప‌టికీ కేబీసీని విజ‌య‌వంతంగా న‌డుపుతూ నంబ‌ర్ వ‌న్ హోస్ట్ గా కొన‌సాగుతున్నారు.

Exit mobile version