JAISW News Telugu

Amit Shah : నక్సలిజంపై అమిత్ షా భేటీ.. హాజరైన సీఎంలు, హోంమంత్రులు, డీజీపీలు

Amit Shah

Amit Shah

Amit Shah : మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరుగుతూన్న ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ, బీహార్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల సీఎంలు, సీఎస్ లు, డీజీపీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ లు, ఏపీ నుంచి హోంమంత్రి అనిత పాల్గొన్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు అభివృద్ధి సాయాన్ని అందిస్తున్న మరో ఐదు కేంద్ర శాఖల మంత్రులతో పాటు డిప్యూటా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులు, కేంద్ర సాయుధ బలగాలకు చెందిన సీనియర్ ఆఫీసర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

2026 నాటికి మావోయిస్టు సమస్యను రూపుమాపడమే లక్ష్యంగా చర్చలు జరగనున్నాయి. త్వరలోనే మావోయిస్టు సమస్య నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని ఇప్పటికే కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ కమాండ్ పెద్దలతో కూడా భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రి కొండా  సురేఖ కామెంట్స్, హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇస్తూ ఆర్డినెన్స్, మూసీ రివర్ డెవలప్ మెంట్, ఇతర రాజకీయ అంశాలను హైకమాండ్ కు సీఎం వివరించనున్నారని సమాచారం.

Exit mobile version