Sunil Bansal : ఏపీలో ఆ పార్టీదే ఘన విజయం..తేల్చేసిన అమిత్ షా ప్రధాన అనుచరుడు

Sunil Bansal

Sunil Bansal

Sunil Bansal : ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీంతో జగన్ కు పరాభవమే ఎదురు కానుందని తెలుస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. రాష్ట్రంలో అధికార మార్పిడికి ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇది చంద్రబాబుకు మరింత ప్లస్ గా మారనుందని అంటున్నారు.

కేంద్రమంత్రి అమిత్ షా ప్రధాన అనుచరుడు సునీల్ బన్సల్ కూడా టీడీపీ కూటమి 145 సీట్లలో జయకేతనం ఎగురవేస్తుందని చెబుతున్నారు. 23 లోక్ సభ స్థానాలు విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభంజనంలో వైసీపీ ఫ్యాన్ రెక్కలు తెగి పడతాయని పేర్కొంటున్నారు. దాదాపు 11 సంస్థలు సర్వే నిర్వహించాయి. అందులో టీడీపీ కూటమిదే పైచేయి అవుతుందని చెబుతున్నాయి.

ఏపీలో బీజేపీతో టీడీపీ, జనసేన పార్టీలు జట్టు కట్టినా జగన్ మాత్రం బీజేపీపై విమర్శలు చేయడం లేదు. టీడీపీ, జనసేన పార్టీలపై విమర్శలు చేస్తున్నా బీజేపీని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. పొత్తులో భాగంగా టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేశాయి. ఈనేపథ్యంలో అధిక సీట్లు టీడీపీ కూటమి గెలుచుకుంటుందని చెబుతుండటంతో వారి ప్రభుత్వమే ఏర్పాటవుతుందంటున్నారు.

175 సీట్లు గెలుచుకుంటామని చెబుతున్న జగన్ 30 కంటే తక్కువ స్థానాలే గెలుచుకుంటారని అంచనా వేస్తున్నారు. లోక్ సభ స్థానాలైతే మరీ కష్టమే అంటున్నారు. సునీల్ బన్సల్ నివేదికపై వైసీపీ ఏం సమాధానం చెబుతుందో చూడాలి మరి. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పతనం ఖాయమని తేలిపోతోందని సర్వేలన్ని ఘోషిస్తున్నాయి.

ఈనేపథ్యంలో ఏపీలో టీడీపీ కూటమిదే అధికారం అని తెలిసిపోతోందంటున్నారు. జగన్ అరాచక పాలనకు అంతం చేసే సమయం ఆసన్నమైందని చెబుతున్నారు. దోపిడీ, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు రాష్ట్రంలో పెచ్చుమీరాయి. అధికార ముసుగులో దొంగలను కాపాడుతున్న జగన్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది.

TAGS