Amit Shah and Tamilsai : చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై మధ్య జరిగిన సంభాషణ వీడియో వైరలవుతోంది. స్టేజీపైకి వచ్చిన ఆమెను దగ్గరకు పిలిచి మందలించినట్లు తెలుస్తోంది. ఆమె వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా షా వినకుండా హెచ్చరించినట్లు వీడియోలో కనిపించింది.
ఇటీవల తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై తమిళిసై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. లోక్ సభ ఫలితాలపై తమిళనాడు బీజేపీలో విభేదాలు తలెత్తాయి. ఆ రాష్ట్ర బీజేపీ అధక్షుడు, మాజీ అధ్యక్షురాలు తమిళిసై మధ్య వాగ్వాదాలు తలెత్తాయి. తమిళసై ఇటీవల మాట్లాడుతూ బీజేపీలోకి సంఘ్ వ్యతిరేక శక్తులను తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అన్నామలై, తమిళిసై మద్ధతుదారులు సామాజిక మాధ్యమాల్లో పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని తమిళిసైని అమిత్ షా హెచ్చరించారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.