Bangladesh Vs USA : అమెరికా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీ 20 ర్యాంకింగ్స్ లో 9 వ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ ను అమెరికా మట్టికరిపించింది. అమెరికా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ టీ 20 లో 19 వ స్థానంలో కొనసాగుతుంది. అమెరికా జూన్ 2 నుంచి వెస్టిండీస్ తో కలిసి టీ 20 వరల్డ్ కప్ నకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ లో మూడు టీ 20 ల సిరీస్ ను ఆడుతోంది.
టీ 20 సిరీస్ లో భాగంగా అమెరికాలో బంగ్లాదేశ్ పర్యటిస్తోంది. న్యూజిలాండ్ నుంచి వలస వెళ్లిన క్రికెటర్ కోరె అండర్సన్, ఇండియా సంతతి క్రికెటర్లు హర్మీత్ లు కలిసి బ్యాటింగ్ లో దుమ్ము రేపారు. దీంతో బంగ్లాదేశ్ పై మూడు బంతులు మిగిలి ఉండగానే అమెరికా విజయం సాధించింది.
బంగ్లాదేశ్ మొదటి బ్యాటింగ్ చేసి 153 పరుగులతో ఇన్సింగ్స్ ను ముగించింది. ఓపెనర్లు లిటాన్ దాస్, నజ్ముల్ శాంటో ఇద్దరు మరో సారి విఫలమయ్యారు. లిటన్ దాస్ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ నుంచి తప్పించుకున్నాడు. లిటన్ దాస్ తన పూర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. దీంతో మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ హృదోయ్, మహ్మదుల్లా ఇద్దరు కలిసి పార్ట్ నర్ షిప్ ను బిల్డ్ చేసి బంగ్లాకు గౌరవప్రదమైన స్కోరును అందించారు.
ఛేజింగ్ లో హర్మిత్ సింగ్, కోరె అండర్సన్ లు బంగ్లాదేశ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి 4.4 ఓవర్లలోనే 62 పరుగులు చేసి జట్టును గెలిపించారు. ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే అమెరికా సంచలన విజయం నమోదు చేసింది. కానీ ఫీల్డింగ్ లో అమెరికా జట్టు ఇంకా ఎంతో మెరుగు పడాల్సి ఉంది. కెప్టెన్ మోనాంక్ పటేల్ రెండు క్యాచ్ లు మిస్ చేయడంతో అమెరికా చివర్లో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.