America Visa Slots : చదువు కోసమో.. లేదంటే ఉద్యోగం కోసమే.. లేదంటే ఆన్ సైట్ కోసమే.. యూఎస్ వెళ్లేందుకు ఎక్కు్వగా ఇష్టపడతారు. ప్రపంచంలోని చాలా దేశాలు ఉన్నా ఎక్కువ మంది ప్రవాసులు ఉన్నది మాత్రం అమెరికాలో అంటే అతిశయోక్తి కాదేమో. ఈ నేపథ్యంలో అమెరికాకు వెళ్లేందుకు వీసా కోసం బుక్ చేసుకునే స్లాట్లు ఒక్కసారిగా మాయం కావడంతో హైదరాబాద్ విద్యార్థులు నిరాశకు లోనయ్యారు.
డజన్ల కొద్దీ విద్యార్థులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కాన్సులేట్ 10 వేల ఎఫ్1 (స్టూడెంట్స్ వీసా) స్లాట్లను తెరిచినప్పటికీ యూఎస్ వీసా అపాయింట్ మెంట్ పొందడంలో విఫలం కావడంతో హైదరాబాద్ కు చెందిన వారు నిరాశకు లోనయ్యారు. మొదటి 5 నిమిషాల్లోనే అన్ని స్లాట్లు బుక్ అయ్యాయని, చాలా సేపు వెయిటింగ్ రూమ్ లో ఉంచామని విద్యార్థులు పేర్కొన్నారు. లాగిన్ అయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.
విద్యా సంవత్సరం సమీపిస్తుండడంతో విద్యార్థులు తమ యూఎస్ యూనివర్సిటీ అడ్మిషన్ గురించి ఆందోళనకు గురవుతున్నారు. అమెరికాలో ఫాల్ సెషన్ సెప్టెంబర్ లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం అమెరికా వీసా అపాయింట్‌మెంట్ కోసం హైదరాబాద్ లో 299 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంది. చెన్నై, ఢిల్లీ, కోల్ కత్తా, ముంబై వంటి ఇతర మెట్రో నగరాల్లో వెయిటింగ్ పీరియడ్ వరుసగా 14, 51, 19, 144 రోజులుగా ఉంది.
‘స్లాట్లు తెరిచి ఉందని నా ఫ్రెండ్ చెప్తే అర్ధరాత్రి ఒంటి గంటకు లాగిన్ అయ్యా.. అదే సమయానికి వాళ్లు వెళ్లిపోయారు. అంతా క్షణాల్లో జరిగింది. మూడు నెలలుగా స్లాట్లను చూసి భయపడ్డా’ అని టెక్సాస్లోని బేలర్ యూనివర్సిటీలో మాస్టర్స్ ప్రవేశం పొందిన అశ్విన్ మహాపాత్ర చెప్పారు.
‘పోర్టల్ వెయిటింగ్ రూమ్ లో 15 నిమిషాలు వేచి ఉన్నా.. కానీ అది నన్ను ప్రధాన పేజీకి తీసుకెళ్లలేదు. అర్ధరాత్రి 1:30 గంటలకు సాయం కోసం నా కన్సల్టెంట్ ను పిలిచా.. కానీ వారు కూడా అపాయింట్ మెంట్ బుక్ చేయలేకపోయారు.’ అని కీర్తి మహిమ చెప్పుకచ్చింది.
దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో స్లాట్లు భర్తీ అయ్యాయని.. జూన్ వరకు మరిన్ని స్లాట్లను తెరుస్తామని అమెరికా వర్గాలు తెలిపాయి. అందుబాటులో ఉంటే ఇతర నగరాల ద్వారా చేసే అంశాన్ని పరిశీలించాలని విద్యార్థులకు సూచించింది.
హైదరాబాద్ కు చెందిన కన్సల్టెన్సీలు కూడా ఇలాంటి సిఫార్సులే చేశాయి. వీరిలో చాలా మంది తమకు సంబంధించిన విద్యార్థుల నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. ‘మాకు కాల్స్ రావడం ప్రారంభం అయ్యాయి. కానీ విద్యార్థులెవరూ స్లాట్లను బుక్ చేయలేకపోయారు.’ అని హిమాయత్ నగర్ కెరీర్ ఎడ్యుకేషన్ గ్రూప్ డైరెక్టర్ ఇర్ఫాన్ అహ్మద్ అహ్మద్ చెప్పారు.
ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకారం, 2024-25 విద్యా సంవత్సరంలో భారతదేశానికి చెందిన 3 లక్షల మందికి పైగా విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉంది. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు 40 వేల మందికిపైగా ఉంటారని అంచనా.