Alexa Prediction : మరికొన్నాళ్లలో ప్రపంచ పటం నుంచి అమెరికా కనుమరుగవుతుందని అమెజాన్ అలెక్సా అసిస్టెంట్ చెప్పడం సంచలనమైంది.. ఈ టిక్ టాక్ వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. ప్రముఖ కంటెంట్ సృష్టికర్త లూసీ బ్లేక్ ఈ వీడియోను టిక్ టోక్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో, ఫిబ్రవరి 20, 2031 నాటికి అమెరికాలో పరిస్థితులు ఎలా ఉంటాయని లూసీ బ్లేక్ సోదరి ఒకరు యాదృచ్ఛికంగా అలెక్సాను అడిగారు. ఒక సూచన చేయమని అడిగారు.
అలెక్సా ఇలా బదులిచ్చింది.. “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫిబ్రవరి 20, 2031న ఉనికిలో ఉండదు. మనుగడ సాగించదు. “ఈ రోజున, వ్యక్తిగత ప్రభుత్వాలకు ప్రజల సమ్మతి లేని దేశాలు మరియు రాష్ట్రాలు ప్రపంచీకరణ కింద ఏకం అవుతాయి” అని అలెక్సా అన్నది. అలెక్సా సమాధానం వివాదాస్పదమైంది.
అమెజాన్ అలెక్సా కృత్రిమ మేధస్సుతో కూడిన వర్చువల్ అసిస్టెంట్. అంటే ఇది మాట్లాడే రోబో లాంటిది. ఇది ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న డేటాను శోధిస్తుంది మరియు వినియోగదారుల ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ప్రపంచ పటం నుంచి అమెరికా కనుమరుగవుతుందన్న అలెక్సా సమాధానంపై సోషల్ నెట్‌వర్క్‌లలో చర్చ జరుగుతోంది.