JAISW News Telugu

Musk : అరగంటలో అమెరికా.. ఇది సాధ్యమేనా..? మస్క్ మామా ఏమంటున్నాడంటే?

Musk

Musk

Elon Musk : మనిషి ఊహకు మించి టెక్నాలజీ దూసుకుపోతోందంటే అతిశయోక్తి కాదు. పురాణాలలో కొన్ని విన్నాం.. అవి నిజమా అని ఆలోచించే లోపే వాటికంటే బెటర్ ది మన కంటికి కనిపిస్తుంది. ప్రపంచ కుభేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ గొప్ప ఇన్వెన్షన్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీని గురించి తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. భారత్ నుంచి అమెరికా ట్రావెల్ చేయాలంటే ఎంత సేపు పడుతుంది. సముద్ర మార్గం గురించి చెప్పుకుంటే 30 నుంచి 40 రోజులు పడుతుంది. ఇక గాలి మార్గం (ఏరోప్లేన్) ద్వారా అయితే 18 గంటలు పడుతుంది. ఇప్పుడు గాలి మార్గంలో కాంతి వేగం రాబోతోందట. అంటే అమెరికా వెళ్లాలంటే కేవలం 30 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఎలన్ మస్క్ ఇటీవల దీన్ని ఈ విషయాన్ని ప్రకటించారు. స్పేస్ ఎక్స్ అండర్ లో ఒక స్టార్ షిప్ ను తయారు చేస్తున్నారట. ఇందులో 1000 మంది ప్రయాణించే వీలు ఉంటుందట. ఇది టేకాఫ్ ప్రాంతంలో రాకెట్ లాగా స్ట్రయిట్ గా పైకి వెళ్లి భూ కక్షను చేరుకుంటుంది. ఇక అక్కడి నుంచి వేగంగా దూసుకువచ్చి అమెరికాలోని ఒక ఎయిర్ పోర్టులో రాకెట్ లాగా నెమ్మదిగా ల్యాండ్ అవుతుందట. ఇప్పటికి మొబైల్స్ వచ్చి ప్రపంచం కుగ్రామంగా మారింది. ఈ స్టార్ షిప్ వస్తే ప్రపంచం ఒకే ఇంట్లో ఉన్న కుటుంబంగా మారుతుంది కాబోలు. ఏది ఏమైనా ఇది రావాలని కోరుకుందాం.

Exit mobile version