Ameesha Patel : రెండున్నర దశాబ్దాలు అంటే ఇరవై ఏళ్ల క్రితం వరకు అసంఖ్యాక అభిమానులను సంపాదించుకున్న తార అమీషా పటేల్. బాలీవుడ్ లో ‘కహో నా ప్యార్ హై’, టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘బద్రి’ చిత్రాలతో స్టార్ డమ్ సొంతం చేసుకుంది. 2023లో వచ్చిన ‘గదర్ 2’ భారీ విజయంతో ఆమె అగ్రస్థానానికి చేరుకుంది. కాలగమనాన్ని ఆమె ధిక్కరించినట్లు కనిపించడం గమనార్హం.
బద్రితో ఆమె తెలుగువారి గుండెల్లో గుడి కట్టుకొని ఉండిపోయింది. 2000 సంవత్సరంలో బద్రిలో కనిపించిన అమీషా పటేల్ ఆ తర్వాత మరో తెలుగు సినిమా నాని (2004)లో కనిపించేందుకు నాలుగేళ్లు పట్టింది. 2005లో ‘నరసింహుడు’లో చేసిన తర్వాత మరో ఆరేళ్లు గ్యాప్ తీసుకొని 2011లో ‘పరమ వీర చక్ర’ సినిమాలో దర్శనం ఇచ్చింది. ఆ తర్వాత 2017లో ఆకతాయిలో గెస్ట్ రోల్ పోషించింది. కేవలం ఇవన్నీ టాలీవుడ్ సినిమాలే కాగా.. మధ్య మధ్య గాప్ లో బాలీవుడ్ తో పాటు పొరుగున ఉన్న కోలివుడ్ లో సినిమాలు చేసింది.
ఇటీవల ఆమె డోల్స్, గబ్బానా బ్రాసియర్ ధరించి చేతులు చాచి తన సౌందర్యాన్ని ప్రదర్శించింది. తన కళ్లను షేడ్స్ తో కవర్ చేసింది. 48 సంవత్సరాల వయస్సులోనూ గ్లామర్ ను మేయింటెన్ చేసుకుంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతోంది. ఈ వాస్తవాన్ని ఎవరు నమ్మగలరు? ప్రకృతి ఆమెపై అసాధారణంగా దయ చూపింది, ఆమె యవ్వనాన్ని కాపాడుతూ వస్తుందేమో. పరువాలను పరచడంలో అమీషా పటేల్ స్టయిల్ వేరు. సినిమాల్లో సంప్రదాయ బద్ధంగా కనిపించిన ఆమె ఇన్ స్టాలో మాత్రం కవ్విస్తూనే ఉంటుంది. ఇటీవల ఆమె అప్ లోడ్ చేసిన పిక్స్ ను చూసి ఫాన్స్ సంబురపడుతున్నారు.