Ambati Rambabu : శ్రీవారి ఆలయంలో అంబటి రాంబాబు హల్ చల్

Ambati Rambabu
Ambati Rambabu : మాజీమంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే శ్రీవారిని దర్శించుకునే సమయంలో ఆయన ప్రవర్తించిన తీరు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అంబటి రాంబాబు జగన్ బొమ్మతో పాటు పార్టీ గుర్తు ఉన్న బ్యాడ్జ్ తోనే ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.
అయితే తిరుమలలో రాజకీయ పార్టీల జెండాలు, బొమ్మలతో రావడం నిషేధం. కానీ ఈ నిబంధన పట్టించుకోకుండా మాజీ మంత్రి శ్రీవారిని దర్శించుకున్నారు. భద్రతా సిబ్బంది కూడా చూసీచూడనట్లుగా ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బ్యాడ్జ్ తోనే వైకుంఠం గుండా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని ఆయన దర్శించుకున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.