JAISW News Telugu

Ambani’s Wedding Menu : ‘అంబానీ’ మెనూ ఇది.. ఎన్ని రకాల వెరైటీలో..

Ambani's Wedding Menu

Ambani’s Wedding Menu, Ananth Ambani and Radhika Marchant Wedding

Ambani’s Wedding Menu : అంబానీ వారి ఇంట పెళ్లంటే మాటలా? ఆయన  దేశంలోనే ధనవంతుడు.. ప్రపంచ కుబేరుల్లో ఒకరు.. ఆయన నిద్రపోయినా.. ప్రతి సెకనుకూ కోట్ల రూపాయలు సంపాదిస్తారు.. లక్షల కోట్లకు అధిపతి అయిన అంబానీ ఇంట విందు అంటే ఎన్ని వంటకాలు ఉండాలి.. మనం తిన్నా తినకపోయినా.. వచ్చినోళ్లకు ఆ మాత్రం నెంబర్ కనిపించాలి కదా.. ఇప్పుడు అలాంటి విందునే ఏర్పాటు చేశారు.. ఏకంగా 2 వేల 500 రకాల వంటకాలు తినడానికి రెడీ చేశారు.  బాబోయ్ 2 వేల 500 రకాల వంటకాలా అని నోరెళ్లబెట్టకండి. ఇది నిజం.. తెరిచిన నోట్లోకి ఈ 2 వేల 500 వెరైటీలు అయితే వెళ్లవు కానీ.. అన్ని రకాలు అయితే తినడానికి రెడీ చేశారు. మన అంబానీ.. ఇంతకీ ఎందుకు అంటారా..

పెళ్లి భోజనాలు అంటే ఎన్ని వెరైటీస్ ఉంటాయో చెప్పక్కర్లేదు. పెళ్లికి వచ్చిన వారు కడుపు నిండా తిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలనుకుంటారు. అందుకే అతిథులకు రుచికరమైన విందు ఏర్పాటు చేయడంలో ఏమాత్రం వెనుకాడరు. సామాన్యుల ఇంట్లో అయితే ఓకే..  మరి ముఖేష్ అంబానీ లాంటి ధనవంతుడు ఇంట్లో పెళ్లి అంటే ఏమాత్రం ఉంటుంటో ఊహించుకోండి.. ఆ విందు గురించి వింటేనే నోరూరాలి.

Ambani Family

గుజరాత్ లోని జామ్‌నగర్‌లో  మార్చి 1,2,3  తేదీల్లో  ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ల ప్రీ వెడ్డిండ్ ఈవెంట్ జరగనుంది.  అయితే ఈ వేడుకల్లో 2,500 వంటకాలు వడ్డించనున్నారు. మొత్తం మూడు రోజులకుగాను ఈ డిష్ లు వరల్డ్ లో బెస్ట్ 25 మంది చెఫ్ లు ప్రిపేర్ చేయనున్నారు. ఈ మూడు రోజుల సెలబ్రేషన్స్ కు 1,000 మంది గెస్టులు  హాజరుకానున్నారు. బ్రేక్ ఫాస్ట్ లో 70 రకాల వంటకాలు, మధ్యాహ్నం భోజనంలో 250 ఫుడ్ ఐటమ్స్, రాత్రి డిన్నర్ లో 250 వంటకాలు తయారు చేయనున్నారు. ఇండియాలో స్టార్  క్రికెటర్లు, పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు, ప్రముఖ సినీ నటులు ఈ ఫంక్షన్ కు వస్తున్నారు. ప్రపంచ ప్రముఖ ధనికులైన బిల్ గేట్స్, మిలిందా గేట్స్ కూడా హాజరవుతున్నారు.

వచ్చిన అతిథులకు తీసుకునే న్యూట్రీషన్ ఫుడ్ ఆప్షన్ ఆధారంగా కావాల్సిన ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, కేలరీస్ ఇలా సెలెక్ట్ చేసుకొని మెనూ తినే విధంగా ప్లాన్ చేస్తున్నారు.  ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మిడ్ నైట్ స్నాక్స్ కూడా అతిథులకు అందించనున్నారు. పాన్ ఆసియన్, జపనీస్, మెక్సికన్, థాయ్ దేశాలకు చెందిన ఫుడ్ వెరైటీలు సిద్ధం చేయాలని ప్లాన్ చేశారట.. ఈ వెరైటీలు తిన్న అతిథులు కచ్చితంగా అన్నదాత సుఖీభవ అనక మానరు.

Exit mobile version