Rakhi Sawant : అంబానీ నీ కొడుకును నా దగ్గరకు 5 రోజులు పంపు..రాఖీ సావంత్ హాట్ కామెంట్స్..

Rakhi Sawant
Rakhi Sawant : ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఈ ఏడాది జులైలో పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ను వివాహం చేసుకోనున్నారు. ఇటీవలే గుజరాత్ జామ్ నగర్ లో ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఈవెంట్ కు దేశంలోని, ప్రపంచంలోని ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులందరినీ పిలిచి తనను పిలువకపోవడంపై రాఖీ సావంత్ అలిగింది. అంతేకాదు తన ఆక్రోషాన్ని వెల్లగక్కిన తీరు ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ సందర్భంగా రాఖీ సావంత్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ అయ్యింది. ‘‘ రాఖీ సావంత్ మీకు బాగా ఉపయోగపడుతుంది. అంబానీ జీ నన్ను నియమించుకోండి. మీరు నన్ను ఉద్యోగంలో పెట్టుకోవాలి. మీ కొడుకు అనంత్ అంబానీని నా దగ్గరకు పంపండి’’ అని హిందీలో చెప్పింది. ‘‘ మీ కొడుకుని ఐదు రోజులు నా దగ్గరకు పంపండి..అతన్ని కర్రలా సన్నగా మారుస్తా’’ అని చెత్తగా మాట్లాడింది.
అయితే రాఖీ సావంత్ వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆమె మతిచెడి ఇలా మాట్లాడుతోందని మండిపడ్డారు. అసభ్యతకు కొంత పరిమితి ఉంటుందని, అతడికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, శరమ్ కరో యాప్ లాగ్ అంటూ ఒక నెటిజన్ తిట్టిపోశాడు.
View this post on Instagram