JAISW News Telugu

Ambani family : రిలయన్స్ ఉద్యోగులకు అంబానీ ఫ్యామిలీ పెళ్లి గిఫ్ట్

Ambani family

Ambani family

Ambani family : ఈరోజు (శుక్రవారం) రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. అందుకోసం ముంబైలో గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు. ఇక మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు దేశ, విదేశాల నుంచి అతిథులు హాజరవుతున్నారు.

అయితే, ఉద్యోగుల్ని కూడా తమ కుటుంబ సభ్యులుగా భావించి వారికి కూడా ప్రత్యేకమైన గిఫ్ట్ లు పంపించారు. రిలయన్స్ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు వెడ్డింగ్ గిఫ్ట్ లు పంపించారు. ఎరుపు రంగు బాక్స్ పై బంగారు రంగు అక్షరాలతో అనంత్-రాధిక పేర్లు ఉన్నాయి.

ఇక ఆ బాక్సులో నాలుగు రకాల తినుబండారాలు ఉన్నాయి. ఆలూ భుజియా, మురుగులు, చిడ్వాతో పాటు ఓ సిల్వర్ కాయిన్ ను రిలయన్స్ ఉద్యోగులకు అందించారు. తమ యజమానులు పంపిన కానుకలను కొందరు ఉద్యోగులు పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Exit mobile version