luxury Boeing plane : రూ.వెయ్యికోట్లు పెట్టి లగ్జరీ బోయింగ్ విమానం కొన్న అంబానీ..

luxury Boeing plane

luxury Boeing plane

Ambani luxury Boeing plane : బడా పారిశ్రామిక వేత్తలకు ప్రైవేట్ జెట్ విమానాలు కొనడం పెద్ద విషయం కాదు. దేశంలో ఇప్పటికే చాలా మంది పారిశ్రామికవేత్తలకు ప్రైవేట్ జెట్ విమానాలు ఉన్నాయి.  దేశంలోనే నంబర్ వన్ సంపన్న వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీ అందరిలా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? అందుకే తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆయన తాజాగా బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాన్ని కూడా కొనుగోలు చేశాడు. దేశంలో ఇదే తొలి ప్రైవేట్ బోయింగ్ విమానం. ఈ విలాసవంతమైన ప్రైవేట్ బోయింగ్ విమానం ఖరీదు వెయ్యి కోట్ల రూపాయలు. డెలివరీకి ముందు, బోయింగ్ విమానం ముఖేష్ అంబానీ అభిరుచులకు అనుగుణంగా స్విట్జర్లాండ్‌కు పంపబడింది.

అక్కడ అవసరమైన అన్ని మార్పులు చేయబడ్డాయి. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను సాధారణంగా విమానయాన సంస్థలు విదేశాలకు, సుదూర సేవలకు ఉపయోగిస్తాయి. ఇంత భారీ విమానాన్ని ముఖేష్ అంబానీ ప్రైవేట్ జెట్ గా కొనుగోలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ బోయింగ్‌ విమానంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన మొత్తం ప్రైవేట్‌ జెట్‌ల సంఖ్య పదికి చేరింది. ఇందులో వివిధ రకాల విమానాలు ఉన్నాయి. పలు టెస్టింగుల అనంతరం ఈ బోయింగ్ ప్రైవేట్ జెట్ ఆగస్టులోనే భారత్‌కు చేరుకుంది. అయితే తాజాగా ఈ వార్త బయటకు వచ్చింది. ఈ బోయింగ్ విమానంలో ఆగకుండా (6355 నాటికల్ మైళ్లు) 11,770 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్న ఈ బోయింగ్ విమానం త్వరలో ముంబైలోని రిలయన్స్ ప్రధాన కార్యాలయానికి చేరుకోనుంది.

TAGS