Ambajipet Marriage Band Review : ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ మూవీ ఫుల్ రివ్యూ!

Ambajipet Marriage Band Review

Ambajipet Marriage Band Review

నటినటులు :సుహాస్, శివాని నగరం, నితిన్ ప్రసన్న, శరణ్య ప్రదీప్.

దర్శకత్వం: దుష్యంత్ కటికనేని

నిర్మాత: ధీరజ్ మొగిలినేని, వెంకట్ రెడ్డి, బన్నీ వాస్ (సమర్పకుడు), వెంకటేష్ మహా (సమర్పకుడు)

సంగీతం: శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్

Ambajipet Marriage Band Review :  హీరో గా, కమెడియన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా మరియు విలన్ గా ఇలా ఎన్నో విభిన్నమైన కోణాలను చూపిస్తూ ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తున్న సుహాస్, ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా తర్వాత హీరో గా నటిస్తూ చేసిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. మరి ఈ సినిమాతో సుహాస్ మరోసారి ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ ని అందుకున్నాడా లేదా అనేది ఈ రివ్యూ లో మనం చూడబోతున్నాం.

కథ :

అంబాజీపేట అనే గ్రామం లో మల్లి(సుహాస్), పద్మ (శరణ్య ప్రదీప్) అనే ఇద్దరు అక్కాతమ్ముళ్ళు ఉంటారు. మల్లి మ్యారేజ్ బ్యాండ్ లో పని చేసే ఒక సాధారణ కుర్రాడు. ఇది ఇలా ఉండగా ఆ ఊర్లో శంకర్ అనే కోటీశ్వరుడు ఊర్లో అవసరం ఉన్న వాళ్లందరికీ అప్పులు ఇచ్చి, అందరినీ తన గుప్పిట్లో పెట్టుకుంటూ ఉంటాడు. అతనికి లక్ష్మీ(శివానీ నాగారం) అనే చెల్లెలు ఉంది. ఈమె మల్లి తో ప్రేమలో పడుతుంది. వీళ్ళ ప్రేమకథ అలా సాగుతూ ఉండగా, పద్మ, శంకర్ లకు మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒక రోజు తన చెల్లెలు మల్లి ని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్నీ తెలుసుకొని ఆవేశం తో రగిలిపోయిన శంకర్, మల్లి అక్క పద్మ ని చాలా ఘోరంగా అందరి ముందు అవమానిస్తాడు. ఆ అవమానం జరిగిన తర్వాత కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ మలుపులు ఏమిటి అనేది వెండితెర మీద చూసి తెలుసుకోండి.

విశ్లేషణ :

ప్రారంభం లో కథలోకి వెళ్ళడానికి డైరెక్టర్ దుశ్యంత్ కాస్త సమయం తీసుకున్నాడు. క్యారెక్టర్స్ ని చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేసాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ సినిమాకి హైలైట్ గా నిల్చింది. అలా సరదాగా సాగిపోతున్న ఈ సినిమా ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే ఆడియన్స్ కి అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని కలిగిస్తుంది. అప్పటి వరకు పర్లేదు, ఎదో అలా సాగిపోతుంది స్టోరీ అనే విధంగా సినిమా ఉంటుంది కానీ, ఇంటర్వెల్ తర్వాత ఈ సినిమా మీద ప్రేక్షకులకు ఉన్న అభిప్రాయం మారిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ లో శరణ్య ప్రదీప్ క్యారక్టర్ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లినట్టు అనిపించింది. అంతా బాగానే ఉంది కానీ, డైరెక్టర్ ఈ సినిమాకి రొటీన్ స్క్రీన్ ప్లే రాయడం ఒక్కటే మైనస్ అయ్యింది అని చెప్పొచ్చు.

ఇక నటీనటులు విషయానికి వస్తే సుహాస్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అతనికి ఏ పాత్ర ఇచ్చిన పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా నటిస్తాడు, ఈ సినిమాలో కూడా ఎంతో సహజం గా మన పక్కింటి కుర్రాడు ఎలా అయితే ఉంటాడో, అలాంటి క్యారక్టర్ లో జీవించి సినిమాని నిలబెట్టాడు. ఇక శరణ్య ప్రదీప్ నటన గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈమె ఈ రేంజ్ నటిస్తుంది అని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఫిదా సినిమాలో సాయి పల్లవి అక్కగా నటించిన తర్వాత ఈమె అనేక సినిమాల్లో నటించింది కానీ, ఈ సినిమానే ఆమెకి గొప్ప గుర్తింపుని తెచ్చిపెట్టింది. శేఖర్ చంద్ర అందించిన సంగీతం ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. పాటలు యావరేజి గా ఉన్నప్పటికీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సందర్భాలకు తగ్గట్టుగా చాలా చక్కగా కొట్టాడు. ఇక దుశ్యంత్ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇతనికి ఇది మొదటి సినిమా అనే ఫీలింగ్ చూసే ప్రేక్షకులకు అసలు అనిపించదు. అంత చక్కగా ఆయన దర్శకత్వం వచించాడు.

చివరి మాట :

సంక్రాంతి తర్వాత మరో మంచి సినిమాగా ఈ చిన్న సినిమా నిల్చింది. సుహాస్ ఇప్పటి వరకు హీరో గా నటించిన సినిమాలలో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.

రేటింగ్ : 3/5

TAGS