JAISW News Telugu

Amaravati : ఓడిపోయి మేలు చేసినందుకు.. జగన్ కు పూలు, పండ్లు తీసుకెళ్లిన అమరావతి మహిళా రైతులు

Amaravati

Amaravati

Amaravati : ఏపీలో వచ్చిన ఫలితాలతో రాష్ట్రంలోని అందరికంటే ఎక్కువగా సంతోషపడింది అమరావతి ప్రజలే. ఒక్క వైసీపీ ఓడితే ఇంత మంది ఆనందంగా ఉంటారా అంటే..జగన్ పాలన అంత అధ్వానంగా ఉందని చెప్పవచ్చు. జగన్ అరాచక పాలనలో ఒక్కరూ కూడా సంతోషంగా లేరనే దానికి నిదర్శనమే మొన్న ఆ పార్టీకి వచ్చిన సీట్లు. సోషల్ మీడియా ప్రభావం బాగా ఉండడంతో ప్రతీ ఒక్కరూ వైసీపీ నేతలను, జగన్ ను మాస్ ర్యాగింగ్ చేస్తున్నారనే చెప్పాలి. అయితే ఇందులో జనాల తప్పేమి లేదండోయ్.. వైసీపీ పాలకులు చేసిన తప్పులే వాళ్లను ట్రోలింగ్ చేసే దాక తెచ్చుకుంది. వారే గొప్పగా పాలిస్తే ప్రజలు వారిని కళ్లకు అద్దుకుని రెండో సారి గెలిపించేవారే కదా.

ఇక జగన్ పాలనలో అత్యంత ఎక్కువగా నష్టపోయింది అమరావతి రైతులే. వారి పోరాటం చరిత్రాత్మకం. వారి పోరాటఫలితమే టీడీపీ కూటమి అద్భుత విజయం. ఎన్నికల ఫలితాల తర్వాత నిన్న (గురువారం) ఆపద్దర్మ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి అరటి పండ్లు, మామిడి కాయలు, స్వీట్లు తీసుకుని రాజధాని రైతులు వచ్చారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చామని రాజధాని రైతులు చెప్పారు. అనుమతి లేకుండా లోపలకు పంపించేది లేదని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందితో రాజధాని మహిళా రైతులు వాదనకు దిగారు.

తమను కష్టాలకు గురి చేసి, చివరికి జగన్ ఓడిపోయి తమకు ఎంతో మేలు చేశారని రాజధాని రైతులు చెప్పుకొచ్చారు. అందుకే ఆయనకు స్వీట్లు, అరటి పండ్లు, మామిడి పండ్లు ఇద్దామని వచ్చామని రైతులు పేర్కొన్నారు. సుమారు అరగంట సేపు జగన్ అపాయింట్మెంట్ కోసం రైతులు వేచి చూశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్పందన రాకపోవడంతో రాజధాని రైతులు గాంధీగిరి పద్ధతిలో ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా అమరావతి రైతులు మాట్లాడుతూ.. సీఎంగా ఉండగా తమ గోడు వినలేదని ఎమ్మెల్యేగా అయినా వింటారని వచ్చామన్న రైతులు చెప్పారు. కూటమి విజయానికి పరోక్షంగా సహకరించిన జగన్‌కు ధన్యవాదాలు చెబుదామని వచ్చామని, ఆయన చొరవ వల్లే ఉద్యమాలు చేయడం ఎలాగో నేర్చుకున్నామని రైతులు వ్యంగ్యంగా తెలిపారు. ఇంట్లో ఉండి గరిటెలు తిప్పే తమకు జెండాలు పట్టకోని ఉద్యమాలు చేయడం నేర్పిన ఘనత జగన్ సార్ దే అని వ్యాఖ్యానించారు. పోలీసులు అనుమతించక పోవడంతో కనీసం మీరైనా అందించాలని రైతులు కోరారు. కుదరదని చెప్పడంతో అక్కడే పాదచారులకు రైతులు పంచిపెట్టారు.

Exit mobile version