JAISW News Telugu

Ramoji Rao – Amaravati : ఏపీ రాజధాని అమరావతి పేరు  పెట్టింది రామోజీ రావు..

Amaravati - Ramoji Rao

Amaravati – Ramoji Rao

Ramoji Rao – Amaravati : తెలుగు మీడియా రంగాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిన రామోజీ రావు కన్నుమూశారు. రామోజీ రావు ఈనాడు తో పాటు ఈటీవీ, ఈటీవీ భారత్, ప్రియా, మార్గదర్శి, ఇలా ఎన్నో సంస్థలను స్థాపించి వాటిని ఉత్తమ స్థితిలో నిలిపారు. ఈ సంస్థల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు లక్ష నుంచి రెండు లక్షల మంది వరకు పని చేస్తున్నారు. రాజకీయాల్లో ప్రత్యక్షంగా కనిపించకపోయినా.. ఆయన పరోక్షంగా చాలా బలమైన నేత చాలా మంది నమ్మకం.. పరోక్షంగా బలంగా ఉంది. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి నూతన రాజధాని అంశంలో చంద్రబాబు నాయుడు రామోజీ రావు సలహా తీసుకున్నారని సమాచారం.

ఆయన సలహాతోనే అమరావతిని రాజధానిగా ప్రకటించారని తెలుస్తోంది. చంద్రబాబుకు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఓ నివేదిక ఇవ్వగా.. చంద్రబాబు మరో కమిటీ ఏర్పాటు చేశారు. గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతాన్ని రాజధాని చేయాలనే ప్రకటనను చంద్రబాబు అసెంబ్లీ లో ప్రతిపాదించారు.

రామోజీ రావు సూచనతోనే అమరాతి రాజధాని ప్రక్రియ మొదలైందని సింగపూర్ సంస్థలతో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకోవడంలో రామోజీ పాత్ర ఉంది. 2019 లో ప్రభుత్వం మారడంతో అమరావతి లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజధాని ఖరారు చేసే సమయంలో రామోజీ రావు స్వయంగా ఒక వ్యాసం రాశాడు. ఎలా ఉండాలో ఎలా ఉంటే బాగుంటుందో వివరించే ప్రయత్నం చేశాడు.  వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి రాజధాని కాదని మూడు రాజధానుల అంశం అనే ప్రతిపాదన తీసుకొచ్చింది. అయితే దీనిపై రామోజీ రావు ఈనాడు, ఈటీవీ పరంగా తీవ్రంగా వ్యతిరేకించారు.

ఏపీ రాజధానికి పేరు పెట్టే విషయంలో రామోజీ రావు అమరావతి అని సూచించారని చంద్రబాబు నాయుడు ఒక సమావేశంలో అన్నారు. చంద్రబాబు కు రామోజీరావు అంటే అంత ఇష్టమని దీన్ని బట్టే అర్థమవుతుంది. ఏపీకి అమరావతి విషయంలో అన్నీ తానై నిలిచిన రామోజీరావు .. ఇక లేరనే విషయాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

Exit mobile version