JAISW News Telugu

Chandrababu : అమరావతి-కర్నూలు.. చంద్రబాబుకు ఆ పక్షపాతం ఎందుకు..?

Chandrababu

Chandrababu

Chandrababu : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గతంలో తీర్మానం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆయన ప్రకటించిన మూడు రాజధానుల్లో ఒకటిగా భావించిన ఈ ప్రాంతంపై చంద్రబాబు నాయుడు ఉదారంగా వ్యవహరించడమే ఈ చర్యకు కారణంగా ఏపీ అంతటా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఈ హామీ ఎప్పటికైనా నెరవేరుతుందా..? అనే సందేహం టీడీపీ అనుకూల సోషల్ మీడియా వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

అయితే, దీనిపై ఏపీ ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆ ‘న్యాయం’ జరగదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. న్యాయ సమీక్షా సమావేశంలో బాబు చెప్పినట్లు ‘అమరావతిలో అంతర్జాతీయ న్యాయ పాఠశాల ఉండవచ్చు కానీ కర్నూలులో హై కోర్టు బెంచ్ ఏర్పాటు సాధ్యం కాదు. 1956 విభజన చట్టంలోని సెక్షన్ 51(2) కల్పించిన వెసులుబాటు 2014 విభజన చట్టంలో లేదు. కేంద్రానికి తీర్మానం చేసి వదిలేయడమే! ఇదీ బాబు ప్లాన్.

చంద్రబాబు నాయుడుకు నిజంగా కర్నూలు ప్రాంతానికి న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే అమరావతికి బదులుగా కర్నూలులో 100 ఎకరాల లా కాలేజీ ఏర్పాటు చేసి ఉండేవారని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలపై కాకుండా అమరావతిపైనే బాబు దృష్టి పెట్టారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను కూడా డెవలప్ చేస్తేనే రాష్ట్రం డెవలప్ అయినట్లని చంద్రబాబుకు తెలియదా..? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పైగా కర్నూలు అతిపెద్ద సిటీ, పైగా చారిత్రకమైన సిటీ కూడా. దీని డెవలప్‌మెంట్ ను పట్టించుకోకుండా ఉండడం రాష్ట్రానికే మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కర్నూలు డెవలప్ విషయంలో వేగంగా స్పందించాలని పలువురు కోరుతున్నారు.

Exit mobile version