CM Chandrababu : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మీ రాష్ట్ర రాజధాని ఎక్కడ అని ఇతర రాష్ట్ర ప్రజలు ఏపీకి వచ్చినపుడు అడిగితే తెల్లమొహం వేసే పరిస్థితి ఉండేది. తాజా మాజీ ముఖ్య మంత్రి ఏపీలో అధికార భాద్యతలు చేపట్టిన తరువాత అమరావతిని రాష్ట్ర రాజధాని చేయడానికి మనసు అంగీకరించలేదు. 2014 లో అధికారంలోకి తెలుగుదే దేశం వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి హోదాలో అమరావతి ని రాష్ట్ర రాజధాని చేయడనికి అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టారు. ఇందుకు జగన్ మోహన్ రెడ్డి అంగీకారం కూడా తెలిపారు.
2019 లో జగన్ అధికారం చేపట్టారు. అమరావతిని రాష్ట్ర రాజధాని చేయకుండా పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో మూడు రాజధానులు చేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటినుంచి అమరావతిలో చేపట్టిన రాష్ట్ర రాజధాని నిర్మాణం పనులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అనే సామెతలా తయారైనది. అమరావతినే రాష్ట్ర రాజధాని చేయాలనీ రాష్ట్ర ప్రజలు ఉద్యమాలు చేశారు. ఉద్యమాన్ని అణచివేయడానికి జగన్ చేతిలో ఎన్ని అధికారాలు ఉన్నాయో వాటన్నిటిని ప్రజలపై ప్రయోగించారు. అయినప్పటికిని ప్రజలు వెనుకడుగు వేయలేదు.
ఇటీవల ముగిసిన ఎన్నికల్లో రాష్ట్ర భాద్యతలను ప్రజలు చంద్రబాబు నాయుడికి కట్టబెట్టారు. ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో అమరావతి అభివృద్ధి గురించే ఎక్కువగా ప్రజలకు వివరించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే అమరావతి పై దృష్టి సారించారు. అమరావతి రాజధానికి సంబంధించిన అధికారులు కూడా ఇప్పుడు తమ వంతు పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు. రాజధాని పనులు వేగవంతం కానున్నాయి.
అమరావతిలో చంద్రబాబు నాయుడి పర్యటన గురువారం ఖరారు అయ్యింది. తన పర్యటనలో పనులపై సంబంధింత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. అమరావతి పూర్తి కావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది. నిధులు ఎంత అవసరం. ఇప్పటి వరకు ఎన్ని నిధులు ఖర్చు చేశాం అనే అంశాలపై ఆయన సమీక్షించనున్నారు. ఆయన పర్యటన ఖరారు ఆయిన విషయం తెలిసి ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం ఒక రోజు ముందుగానే ఏర్పడింది ఆ ప్రాంత ప్రజలు చంద్రబాబు కు భారీ ఎత్తున స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.