
Amaravati Farmers
Amaravati Farmers : అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో రాజధాని ప్రాంత రైతులు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించారు. ఆదివారం తెల్లవారు జామున తుళ్లూరు శిబిరం నుంచి రైతులు, మహిళలు పొంగళ్లు తయారుచేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఇంద్రకీలాద్రికి కాలి నడకన బయల్దేరారు.
ఉదయం 11 గంటల లోపు అక్కడికి చేరుకుని ముక్కులు చెల్లించుకునేలా ప్రణాళిక రూపొందించారు. తుళ్లూరు నుంచి రాయపూడి, రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి, కరకట్ట, ప్రకాశం బ్యారేజీ మీదుగా పాదయాత్ర సాగనుంది. ఈ పాదయాత్రలో రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.