CM Chandrababu : ఏఐ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతి: సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఏపీ రాజధాని అమరావతిని వరల్డ్ సిటీగా మార్చుతామని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీగా ఉండాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. గురువారం సచివాలయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీయే అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అర్థం వచ్చేలా అమరావతి లోగోను అమరావతి పేరులోని A, చివరి అక్షరం I కలిసి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రెడీ చేయాలన్నారు. రాజధానిలో ఎటుచూసినా సాంకేతిక ఉట్టిపడేలా రాజధాని నిర్మాణం చేపట్టాలన్నారు.
గత ప్రభుత్వం అమరావతిపై కక్ష కట్టిందని, ఉద్దేశపూర్వకంగా రాజధానిగా అమరావతిని పక్కన పెట్టిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు గర్వంతో చెప్పుకునేలా రాజధాని నిర్మాణం ఉండాలని వివరించారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం, అందుకయ్యే సమయం, టెండర్లు పిలవడం తదితర అంశాలపై ఈ సమావేశంతో సీఎం సమీక్షించారు. టీడీపీ హయాంలో సీఆర్డీయే కార్యాలయంను ఎంత మేరకు చేపట్టామో ఇప్పుడు అలాగే ఉండిపోయిందని, ఈ భవన నిర్మాణం మూడు నెలల్లో చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.