Akkineni Amala : కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసిన అక్కినేని అమల
Akkineni Amala : తెలంగాణ మంత్రి కొండా సురేఖపై రాహుల్ గాంధీకి అక్కినేని అమల ఫిర్యాదు చేశారు. తన కొడుకు, మాజీ కోడలు విడాకులపై దారుణంగా కామెంట్స్ చేసిన కొండ సురేఖ పై ఏకంగా రాహుల్ గాంధీకి ట్యాగ్ చేస్తూ అమల సంచలన ట్వీట్ చేశారు. తన ఫ్యామిలీపై అసత్య ఆరోపణలు చేసిన కొండా సురేఖపై మండిపడ్డ అక్కినేని అమల ఉతికి ఆరేశారు.
‘‘రాజకీయ వివాదాల్లోకి మమ్మల్ని లాగవద్దు.. నా భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. ’’ అంటూ అమల ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలుచేశారు.
‘రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుంది? సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలి’ అంటూ అమల ట్వీట్ లో కోరారు.
కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసిన అక్కినేని అమల
తన ఫ్యామిలీపై అసత్య ఆరోపణలు చేసిన కొండా సురేఖపై మండిపడ్డ అక్కినేని అమల
రాజకీయ వివాదాల్లోకి మమ్మల్ని లాగవద్దు.. నా భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు.
రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం… pic.twitter.com/N0RTN9JW8w
— Telugu Scribe (@TeluguScribe) October 2, 2024