JAISW News Telugu

Allu Arjun : అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట

Allu Arjun

Allu Arjun

Allu Arjun : అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. నంద్యాల పోలీసులు ఎన్నికల సమయంలో నమోదు చేసిన కేసు క్వాష్ చేయాలని అల్లు అర్జున్ పిటిషన్ వేశారు. దీంతో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ తరుణంలోనే అల్లు అర్జున్ కు ఊరట లభించింది. కాగా, ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజు మే 11న వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ వచ్చి మద్దతు ప్రకటించారు. దీంతో అల్లు అర్జున్ ను చూడడానికి అభిమానులు తరలివచ్చారు.

దీంతో అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించారని డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్, నాటి ఎమ్మెల్యే శిల్పా రవిపై టూ టౌన్ పిఎస్ లో కేసు నమోదయింది. నంద్యాల పర్యటన వ్యక్తిగతమన్న అల్లు అర్జున్ తమపై నమోదైన కేసును కొట్టి వేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నవంబరు 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈరోజు (బుధవారం) ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Exit mobile version