Allu Arjun : అల్లు అర్జున్ న్యూ లుక్ అదుర్స్.. స్టైల్ లోనూ తగ్గేదేలే
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ లోనే స్టైలిష్ స్టార్ అని మనకు తెలిసిందే. ఆయన కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ ఎప్పటికప్పుడూ మారుస్తూ ఉంటారు. ఎప్పుడూ ట్రెండీగా ఉంటారు. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇండియన్ లెవల్ లో పెరిగిపోయింది. ఇప్పుడందరి నజర్ పుష్ప -2 పైనే ఉంది. ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
సినిమా పరంగానే కాక బన్నీ యాడ్స్ తో కూడా విపరీతంగా సంపాదిస్తున్న విషయం తెలిసిందే. పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడు. ఫుడ్, రెస్టారెంట్ రంగంలోనూ దూసుకెళ్తున్నాడు. తాజాగా అల్లు అర్జున్ న్యూ లుక్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సోషల్ మీడియాలో బన్నీ ఫుల్ యాక్టివ్ గా ఉంటారనేది తెలిసిందే. తాజాగా స్టైలిష్ లుక్ లో ఉన్న ఫొటో ట్రెండింగ్ లో ఉంది. బ్లాక్ షర్ట్ వేసుకుని గాగుల్స్ పెట్టుకుని కూల్ గా చూస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బన్నీ న్యూ లుక్ అదిరిపోయిందంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.