JAISW News Telugu

PDSU demands : అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాలి: పీడీఎస్.యూ డిమాండ్

PDSU demands

PDSU demands Allu Arjun Arrest

PDSU demands : ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ను అరెస్టు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (పీడీఎస్‌యూ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం వల్ల రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కొడుకు చావు బతుకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.దీనికి కారణమైన అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాలని పీడీఎస్.యూ డిమాండ్ చేసింది.

Exit mobile version