Niharika : మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు వచ్చాయని కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జనసేన పార్టీకి కాకుండా నంద్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికాడు. దీంతో జనసేన కార్యకర్తలు, మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సోషల్ మీడియాలో బన్నీని టార్గెట్ చేస్తూ, దారుణంగా ట్రోల్ చేయడం మొదలెట్టారు. మెగా కుటుంబ సభ్యులు ఇప్పుడు అల్లు అర్జున్ ను తమ ఫ్యామిలీలో భాగంగా చూడటం లేదని తెలుస్తోంది.
అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి నంద్యాల వెళ్లి వైయస్సార్ పార్టీ అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డికి సపోర్ట్ చేసి రాగా ఆ సమయంలో మెగా బ్రదర్ నాగబాబు ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే’ అంటూ ఎక్స్ లో పోస్టు పెట్టాడు. దీంతో అల్లు వర్సెస్ మెగా అభిమానుల మధ్య విభేదాలకు దారితీసింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో బన్నీ దంపతులను అన్ ఫాలో చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. లేటేస్టుగా నిర్మాతగా అవతారమెత్తిగా నాగబాబు కూతురు నిహారిక కమిటీ కుర్రోళ్లు ఈవెంట్ లో స్పీచ్ అదరగొట్టింది. కాగా ఆమె మాట్లాడిన మాటలు మెగా ఫ్యామిలీని, అల్లు అర్జున్ ను ఇగ్రోర్ చేసినట్లు కనిపిస్తున్నాయి.
నిహారిక తమకు మంచి కాలం నడుస్తుందని చెప్పి చరణ్ అన్న సినిమా ఆస్కార్ కు వెళ్లింది. చిరంజీవి పెదనాన్నకు పద్మ విభూషణ్ వచ్చింది. మా బాబాయ్ డిఫ్యూటీ సీఎం అయ్యారు. ఇదే మూడ్ లో నా సినిమాను కూడా సక్సెస్ చేసేయండ్ర అంటూ ప్రేక్షకులను కోరింది. కాగా.. అల్లు అర్జున్ కూడా ఫిల్మ్ ఫేర్ అత్యుత్తమ అవార్డు అందుకున్నాడు. పుష్ప తో పాన్ ఇండియా హిరోగా మారాడు. కానీ ఆయన పేరు ఎందుకు ఎత్తలేదు. కావాలనే నిహారిక అల్లు అర్జున్ అనే మాటను పక్కన పెట్టిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.