Allu Arjun : పవన్ కుమారుడిపై స్పందించని అల్లు అర్జున్.. కారణం అదేనా?

Allu Arjun : సింగపూర్‌లో వేసవి శిక్షణ శిబిరానికి వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై సినీ, రాజకీయ రంగాల నుండి పలువురు ప్రముఖులు స్పందించి పవన్ కుటుంబానికి మద్దతుగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ గారు స్వయంగా సింగపూర్ వెళ్లి పర్సనల్‌గా పరామర్శించడం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం.

అయితే అదే మెగా ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరో అల్లు అర్జున్ మాత్రం ఇప్పటివరకు ఈ ఘటనపై ఏ వ్యాఖ్యానమూ చేయలేదు. ఆయన మౌనంగా ఉండటంపై పలు ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. గతంలో సంధ్య థియేటర్ వివాదంలో అల్లు అర్జున్ అరెస్టయ్యినప్పుడు పవన్ కళ్యాణ్ ఆయనకు మద్దతుగా నిలవకపోవడం ప్రస్తుతం అల్లు అర్జున్ మౌనానికి కారణమని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీలో ఉన్న విభేదాలు మరోసారి ప్రజల ముందుకు వచ్చాయి. అభిమానులు మాత్రం ఇలాంటి సమయాల్లో వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి కుటుంబ బంధాలను ప్రాముఖ్యత ఇవ్వాలని ఆశిస్తున్నారు.

TAGS