Film industry : సినీ పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తామని టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో ఎంతో అందమైన లోకేషన్లు, చిత్రీకరణకు అనువైన ప్రదేశాలున్నాయని.. టాలీవుడ్ ఏపీకి వస్తే బాగుంటుందని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారని పల్లా శ్రీనివాస్ అన్నారు. తెలంగాణలో టాలీవుడ్ కు అనువైన పరిస్థితులు లేవని.. వేధించి వెంటాడుతున్నారని.. అందుకే ఏపీకి టాలీవుడ్ రావాలంటూ పల్లా పిలుపునిచ్చారు. ఇదే ఇప్పుడు వైరల్ అవుతోంది. రేవంత్ రెడ్ది వల్ల ఇప్పుడు టాలీవుడ్ హైదరాబాద్ విడిచివెళ్లే ప్రమాదంలో పడిందని.. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ఉపయోగం లేకుండా పోతోందని అందరూ అభిప్రాయపడుతున్నారు.