Chinta Mohan : ఎన్నికల ఫలితాల్లో ఏపీలో ఎన్డీయే కూటమి గెలుపొందుతుందని, చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టబోతున్నారని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ తెలిపారు. ఆయన ఆదివారం ఢిల్లీలోని ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడారు.
‘‘ఏపీలో సీఎం జగన్, ప్రధాని మోదీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపించాయి. చంద్రబాబు బీజీపీతో పొత్తు పెట్టకోవడం వల్ల కొన్ని అసెంబ్లీ సీట్లు తగ్గుతాయి. లేకుంటే 150కి పైగా సాధించేవారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి 150కి మించి ఎంపీ స్థానాలు రావు. ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ వైసీపీ రూ. 4 నుంచి 5 వేల కోట్ల వరకు ఖర్చు చేసింది. అంత డబ్బును జగన్ ఎలా తేగలిగారు? అందుకు ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ పరస్కారిలిచ్చినా తక్కువే. ఎన్ని అక్రమాలకు పాల్పడినా, ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పారు’’. అని చింతా మోహన్ వెల్లడించారు.