Election Campaign : జోరుగా సోషల్ మీడియాలో కూటమి ఎన్నికల ప్రచారం

Election Campaign on Social Media
Election Campaign : సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రెండు వీడియోలు విస్తృతంగా వైరలవుతున్నాయి. ఒక వీడియోలో ‘రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన పాలకులే రామక్కా..’ అంటూ ఇద్దరు యువతలు నృత్యం చేస్తున్నారు. అలాగే ఇంకో వీడియోలో ముగ్గురు యువతులు ఓ బైక్ పై, మరో బైక్ పై ముగ్గురు యువకులు ‘తిప్పర మీసం ఇది ఆంధ్రుడి రోషం.. రారమ్మని పిలుస్తున్నది తెలుగుదేశం..’ అంటూ ప్రచారం చేస్తన్నట్లు ఉంది.
ఈ వీడియోలు మీడియాలో ఎక్కువగా వైరలవుతుండడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతు పెరుగుతున్నట్లు భావిస్తున్నారు. ఏది ఏమైనా గెలుపు కూటమి అభ్యర్థులదే అనే ధీమా పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రత్యేకంగా వీడియోలు తయారు చేయిస్తున్నారు. పార్టీల హామీలను.. గతంలో చేసిన అభివృద్ధి చేసిన కార్యక్రమాలను వివరిస్తూ.. ఎదుటి పార్టీల బలహీనతలను ఎత్తిచూపుతూ.. వీడియోలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయిస్తున్నారు. ఇలా లక్షలాది వీక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.