Alliance Manifesto : మహా కూటమి మేనిఫెస్టో రిలీజ్.. ఏఏ అంశాలు ఉండబోతున్నాయంటే?

Alliance Manifesto

TDP Janasena BJP Manifesto

Alliance Manifesto  :  తెలుగుదేశం, జనసేన, బీజేపీ మహా కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం (ఏప్రిల్ 30) రోజున ఆవిష్కరించారు. గత ఐదేళ్లలో జనసేన, టీడీపీ రెండు పార్టీలకు అందిన ఫిర్యాదులన్నింటినీ మేనిఫెస్టోలో సమగ్రంగా ప్రస్తావించినట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ‘ఇది పూర్తి మేనిఫెస్టో, మాకు వచ్చిన ఫిర్యాదులు, గత ఐదేళ్లలో టీడీపీకి వచ్చిన ఫిర్యాదులను ఇందులో కవర్ చేశాం. కాబట్టి మేము ప్రతిదీ మరియు ప్రతి సమస్యను సేకరించాం. వాటి పరిష్కారానికి మార్గాలను కూడా అన్వేషించాం’ అన్నారు.

ఇది ఇలా ఉంటే, రెండు మ్యానిఫెస్టోల్లోనూ ప్రధాని మోదీ చిత్రం కనిపించకపోవడం విశేషం. అయితే వైఎస్సార్‌సీపీ ఇచ్చిన హామీల జాబితా నుంచే ఎక్కువ అంశాలను తీసుకున్నారని వైఎస్సార్‌సీపీ విమర్శించింది.

మేనిఫెస్టోలో ఉన్న అంశాలు..

* ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి ఏటా రూ. 15,000 అందజేస్తాం.
* దీపం పథకం కింద ప్రతీ సంవత్సరం మూడు సిలిండర్లను ఫ్రీగా ఇస్తాం.
* రైతులకు ఏడాదికి రూ. 20 వేల పెట్టుబడి సాయం అందజేస్తాం.
* నిరుద్యోగులకు నెలకు రూ. 3వేల జీవన భృతి అందజేస్తాం.
* ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 సంవత్సరాల మహిళలకు నెలకు రూ. 1500 అందజేస్తాం.
* మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం

వీటితో పాటు మరికొన్ని అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.

TAGS