West Bengal Governor : పశ్చిమ బెంగాల్ గవర్నర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు
West Bengal Governor : పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. బోస్ తనను వేధింపులకు గురి చేశారని ఓ మహిళ ఆరోపణ చేశారు. కోల్ కతా రాజ్ భవన్ లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానిక హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఉద్యోగం విషయమై గవర్నర్ బోస్ ఆ మహిళను రెండు సార్లు పిలిచి వేధింపులకు గురి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే ఈ ఆరోపణలపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ స్పందించారు. సత్యం గెలుస్తుందని, కల్పిత కథనాలను చూసి తానెప్పుడూ భయపడనని తెలిపారు. ఇలా తనను కించపరచడం ద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని ఎవరైనా భావిస్తే గాడ్ బ్లెస్ దెమ్. కానీ, బెంగాల్ లో అవినీతి, హింసకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ఆపలేరని బోస్ పేర్కొన్నారు. మరోవైపు గవర్నర్ పై వస్తున్న ఆరోపణలపై టీఎంసీ నాయకురాలు శశి పంజా స్పందించారు. తాము దిగ్ర్భాంతికి గురయ్యామని, సందేశ్ ఖాలీకి వెళ్లి మహిళల హక్కుల గురించి మాట్లాడిన ఆయన, ఇప్పుడు చాలా అవమానకరమైన ఘటనకు పాలపడటం బాధాకరమన్నారు.