JAISW News Telugu

Allari Naresh : ‘ఆ ఒక్కటి అడక్కు’లో కనిపించని కామెడీ.. ఆ అల్లరి ఎక్కడ? అంటూ అభిమానుల ఫైర్..

Allari Naresh

Allari Naresh

Allari Naresh : కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ‘అల్లరి నరేశ్’ అని చెప్పవచ్చు. ఆయన చేసిన అల్లరి సినిమానే ఆయన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన చాలా కామెడీ సినిమాలు చేశారు.. మనం కూడా వాటిని చూసి తెగ ఎంజాయ్ చేశాం.

ఆ తర్వాత సీరియస్ సినిమాలు చేశాడు. పోలీస్ ఆఫీసర్ గా, గ్రామానికి టీచర్ గా కానీ అవేవీ ఆయనకు వర్కవుట్ కాలేదు. దీంతో మళ్లీ ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే కామెడీ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. కానీ ఆ ఒక్కటి అడక్కు పూర్తిగా తడిసి ముద్దయింది.

టీజర్, ట్రైలర్ చూస్తుంటే ఇది డీసెంట్ కామెడీ ఎంటర్ టైనర్ అవుతుందని అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ, సినిమా మాత్రం గో అనే మాట నుంచే బోర్ కొట్టింది.

కామెడీని పట్టాలెక్కించడంలో డైరెక్టర్ విఫలం అయ్యాడనే చెప్పాలి. జోకులు బలవంతంగా వేసినట్లు, మూస ధోరణిలో సాగాయి. దీనికి తోడు డైరెక్షన్ పై కూడా ప్రేక్షకులు పెదవి విరిచారు. సినిమా నడుస్తున్నంత సేపు థియేటర్లలో కూర్చుకునేందుకు ప్రేక్షకులు చాలా ఇబ్బంది పడ్డట్లు చెప్తున్నారు.

పెళ్లిళ్లకు సంబంధించిన వివిధ కుంభ కోణాలు, మోసాల గురించి సందేశం ఇచ్చేలా కథను రెడీ చేసుకున్నాడు డైరెక్టర్. కానీ హీరో పాత్ర పెళ్లి చేసుకోకపోవడం అనే ప్రధాన ఇతివృత్తంతో ఆ థీమ్ సరిపోలలేదు. చాలా సబ్ ప్లాట్లు పెట్టారు. అవి అర్థం లేకుండా చూసేందుకు ఇబ్బందిగా ఉండేలా అనిపించింది.

ఈ చిత్రం కామెడీ, ఎంటర్ టైన్ మెంట్ తో కూడి ఉంటుందని హీరో నరేష్ తన ప్రమోషన్ ఇంటర్వ్యూలలో హామీ ఇచ్చాడు. పాత కామెడీ క్లాసిక్ ‘అ ఒక్కటి అడక్కు’ అనే టైటిల్ ను వాడడాన్ని కూడా ఆయన సమర్థించుకున్నారు. కనీసం ఆ ఐకానిక్ టైటిల్ ను ఈ డెడ్ ఆన్ అరైవల్ సినిమాకు వాడకుండా ఉండాల్సింది.

సినిమాలు వర్కవుట్ అవుతాయా లేదా అనేది వేరే విషయం కానీ తన తండ్రి ఐకానిక్ సినిమా టైటిల్ ను వాడుకొని ఏం చేస్తున్నాడో సీరియస్ గా ఆలోచించి ఉండాల్సింది. జీవితంలో ఒక అవకాశాన్ని చేజార్చుకున్న ఆయన ఈవీవీ నుంచి మరో టైటిల్ పెట్టుకున్నా ఎవరూ నమ్మరు.

పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఇది అతని నుంచి వచ్చిన మరో రొటీన్ టెంప్లేట్. అల్లరి నరేష్ తన అభిమానుల కోసం సాలిడ్ కామెడీతో రావాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version