
New President of Tana Niranjan Sringavarapu
New President of Tana Niranjan Sringavarapu : ఉత్తర అమెరికా తెలుగు సంఘం-తానా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత నిరంజన్ శృంగవరపు మొదటిసారిగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనటానికి విజయవాడకు విచ్చేశారు. ఈసందర్భంగా నేడు ఉదయం విజయవాడ మొగల్ రాజపురంలోని మినర్వా హోటల్ లో సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం నిరంజన్ శృంగవరపు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పష్పగుచ్ఛం అందజేసి శాలువా తో సత్కరించారు..