Jagan Viral Video : ‘‘జగన్ రెడ్డి వాగ్దానాలన్నీ వైన్స్ షాపులో దొరుకుతున్నాయ్..’’ కడుపుబ్బా నవ్వించే వీడియో

Jagan Viral Video
Jagan Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఎన్నికలకు మరో 13 రోజులే ఉండడంతో పార్టీల అధినేతలు ప్రచారం బిజీ అయిపోయారు. రాబోయే రోజులు అన్ని పార్టీలకు కీలకం కావడంతో ప్రత్యర్థులను దెబ్బతీసే వ్యూహాలను రచిస్తున్నారు. ప్రజల్లో ప్రత్యక్షంగా ప్రచారం చేయడంతో పాటు సోషల్ మీడియా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడం కన్నా ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోయడం, వారిని ఇరుకున పెట్టే వీడియోలు, మీమ్స్, ఆర్టికల్స్ నే క్రియేట్ చేస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేలా వైసీపీ ప్రచారం చేయిస్తోంది. ఇక జగన్ గత ఐదేళ్లుగా చేసిన పాపాలను ప్రజల ముందు టీడీపీ, జనసేన ఉంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్ హామీలపై ఓ వీడియో జనాలను కడుపుబ్బా నవ్విస్తోంది. జగన్ అధికారంలోకి రాకముందు వివిధ హామీలను ఇచ్చారు. అయితే వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదు. జగన్ స్వయంగా చేసిన హామీల ప్రసంగాలను ఈ వీడియోలో ఎడిట్ చేసి పెట్టారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే జగన్ హామీలు అమలు కావడం పక్కకు పెడితే అవన్నీ కూడా వైన్స్ షాపుల్లో లిక్కర్ పేరిట దొరకడం గమనార్హం. రైల్వే జోన్, ఉద్యోగ క్యాలెండర్ , ప్రాజెక్ట్ లు నిర్మాణం, మెగా డీఎస్సీ పై జగన్ అధికారంలోకి రావడానికి ఎన్నెన్నో హామీలు గుప్పించారు. ఇవన్నీ ఇప్పుడు రైల్వే జోన్ ,క్యాలెండర్, ప్రాజెక్ట్, మెగా డీఎస్సీ పేరిట వైన్స్ షాపుల్లో దొరుకడం గమనార్హం. ఇదే విషయమై ఆయన సోదరి వైఎస్ షర్మిల కూడా విమర్శించడం గమనార్హం. జగన్ చేసిన వాగ్దానాలన్నీ వైన్స్ షాపులో ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇదేనా వైఎస్ వారసత్వం అని ప్రశ్నించారు. మొత్తానికి ఈ వీడియో జనాలను బాగా నవ్వించడమే కాదు ఆలోచింపజేస్తుందని చెప్పవచ్చు.