KCR : కేసీఆర్ ను కలిస్తే ఓటమే.. తాజాగా కేజ్రీవాల్ కు అదే గతి.. ట్రోలింగ్
KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన నేతలు ఎన్నికల్లో ఓటమిపాలవుతున్నారనే విమర్శలు సోషల్ మీడియాలో జోరుగా చెలరేగుతున్నాయి. తాజాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం చెందడంతో, ఈ అంశంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
శనివారం, ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, బీజేపీ విజయాన్ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సెటైరికల్ ట్వీట్ వైరల్ అయింది. దీనిపై కాంగ్రెస్ నేతలు, నెటిజన్లు భిన్నంగా స్పందించారు.
ఇక, ఆప్ పార్టీ ఓటమి కారణంగా కేసీఆర్‌పై విమర్శలు పెరిగాయి. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గతంలో కేసీఆర్‌ను కలవడం వల్లే ఆయన పార్టీ భారీ ఓటమిని మూటగట్టుకున్నదని కొందరు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. “మనం చెయ్యి కలిపితే మామూలుగా లేదుగా! అస్సాం.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే..” అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
కేసీఆర్ గతంలో పలువురు ముఖ్యమంత్రులకు పుష్పగుచ్ఛాలు అందించిన ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. “మీ కుటుంబం వల్లనే ఆప్ పార్టీ ఈ దారుణ ఓటమిని ఎదుర్కొంది” అంటూ కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.