Ecuador : ప్రస్తుతం విద్యుత్ సంక్షోభం ఆ దేశాన్ని కుదిపేస్తోంది. దీంతో దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్ లో ఈ పరిస్థితి ఎదురైంది. ఉద్యోగులు గురు, శుక్రవారాలు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశ అధ్యక్షుడు డేనియల్ నొబోవా ప్రకటించారు. ఇంధన సంక్షోభమే విద్యుత్ కొరతకు కారణమైందని చెబుతున్నారు. హైడ్రో ఎలక్ర్టిక్ ప్లాంట్లలో నీటిస్థాయిలో పడిపోవడంతో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందన్నారు.
దేశానికి అతిపెద్ద పవర్ ప్లాంట్ కొకా కొడా సిన్ క్లెయిర్ లో నీటి స్థాయిలు పూర్తిగా పడిపోయాయి. దీంతో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఇది పర్యావరణ పరిస్థితుల నిర్లక్ష్యం, అవినీతి వల్ల చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను దాచిన అధికారులు దీనికి కారకులుగా మారుతున్నారు. దీనికి కారణమైన మంత్రిని తొలగించి కొత్త వారిని నియమించారు.
పొరుగు దేశమైన కొలంబియా ఎలక్ట్రిసిటీ ఎగుమతిని నిలిపివేయడంతో ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని ఆదేశించింది. వర్క్ ఫ్రం హోం ప్రకటన వచ్చింది. పూర్వ అధ్యక్షుడు గిలెర్మో లాస్సో పార్లమెంట్ ను రద్దు చేయడంతో జరిగిన ఎన్నికల్లో 35 ఏళ్ల డేనియల్ 2023 చివరలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం శాంతి భద్రతల సమస్య ఎదుర్కొంటోంది.
వరసగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో అధ్యక్షుడికే హెచ్చరిక సందేశాలు పంపారు. దీంతో అధ్యక్షుడు కఠిన చర్యలు తీసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని చూస్తున్నారు. దేశంలోకి ఉగ్రమూలాలు రాకుండా చేయాలని చూస్తున్నారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా పాలనలో మార్పులు తీసుకొస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆ దేశంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
దేశాధ్యక్షుడి ఆదేశానుసారం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంకే పరిమితమవుతున్నారు. ఇంధన సమస్యను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వాహనాల వాడకం తగ్గింది. ఉన్న వనరులను ఉపయోగించుకుని అత్యవసర సందర్భాల్లోనే బయటకు వస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావడానికి ఇష్టపడటం లేదు.