Fake Notes : ఐసీఐసీఐ బ్యాంకు కొత్త నోట్లన్నీ ఫేక్.. వైరల్ వీడియో
Fake Notes : దేశంలో నకిలీ(ఫేక్) నోట్లు సాధారణంగా చూస్తూనే ఉంటాం. ఎక్కడో చోట దొంగ నోట్లు అనబడే ఈ కరెన్సీ నోట్లు పట్టుబడుతూనే ఉంటాయి. దొంగ నోట్లను కట్టడి చేయడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం గతంలో నోట్ల రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే మొన్నటి మొన్న రూ.2వేల నోట్లను కూడా రద్దు చేశారు. మన దేశంలో ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్నా దొంగ నోట్లను అరికట్టడం అసాధ్యమవుతోంది. ఎంతో మందిని అరెస్ట్ చేసి జైళ్లలో పడేసినా నకిలీ కరెన్సీ చలామణిలోకి వస్తూనే ఉంది.
అయితే తాజాగా ఫేక్ కరెన్సీ నోట్ల కట్టలు ఉన్న ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చూసిన దాన్ని బట్టి రూ.500 నోట్ల కట్టలు చాలా ఉన్నాయి. అన్ని సీల్ చేసి మరి ఉన్నాయి. ఆ నోట్ల కట్టలపై ఐసీఐసీఐ స్టిక్కర్ ఉండడం విశేషం. ఓ మహిళ ఆ నోట్ల కట్టలను ఆ వీడియోలో చూపిస్తూ వాటిని ఒక్కొక్కటిగా మనకు చూపిస్తోంది. ఓ పెద్ద నోట్ల కట్టకు కింద, మీద ఒరిజినల్ నోటును పెట్టి లోపల మొత్తం అన్ని నోట్లు కూడా ప్రింట్ కాకుండా ఉన్నాయి. సైడ్ లకు మాత్రం 500 నోటు కలరింగ్ ఉంది. ఇలా ఎన్నో నోట్ల కట్టలను ఆమె ఆ వీడియోలో చూపించింది. ప్రతీ కట్ట కూడా ఇలాగే ఉండడం గమనార్హం.
ఈ నోట్ల కట్టలు నిజంగా ఐసీఐసీఐ నుంచే బయటకు వచ్చాయా? లేదా ఎవరైనా ఇలా వైరల్ చేయడానికి చేశారా? అనేది మాత్రం తెలియదు. వీడియో మొత్తం కూడా కట్టలను మాత్రమే చూపించారు. అసలు విషయం ఏంటి అనేది ఎక్కడ కూడా చెప్పలేదు. దీంతో ఎవరి ఊహకు తగ్గట్టుగా కామెంట్ చేస్తున్నారు. అసలు ఈ వీడియో ద్వారా ఏం చెప్పదలుచుకున్నారో కూడా స్పష్టత లేదు. బ్యాంకు ద్వారా కూడా ఇలాంటి నోట్లు వస్తున్నాయని చెప్పాలనుకున్నారా? లేదా బ్యాంకు పేరు చెప్పి ఇలాంటి ఫేక్ కరెన్సీని చలామణిలోకి తెస్తున్నారా? అనే క్లారిటీ లేకుండా వీడియో ఉండడంతో జనాలు అయోమయం చెందుతున్నారు.