JAISW News Telugu

Ali tho Saradaga season 2 : ఆలీతో సరదాగా సీజన్ 2.. మొహమాటంతో నష్టపోయానన్న గోపీచంద్..

FacebookXLinkedinWhatsapp
Ali tho Saradaga season 2

Ali tho Saradaga season 2 Gopichand Episode

Ali tho Saradaga season 2 : టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోనే కాదు విలన్ రోల్స్ లో కూడా మెప్పించాడు గోపీచంద్. విలన్ గా చేసిన జయం, వర్షంకు భారీ ప్రశంసలు అందాయి. హీరోగా చేసిన సినిమాలకు మాత్ర ఆంత మేర ప్రశంసలు దక్కలేదు. అయితే ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చేది మాత్రం గోపీచంద్-ప్రభాసే. వీరు వర్షంలో చేశారు. కానీ ఒకరు విలన్, ఒకరు హీరో. ఇద్దరు హీరోగా మల్టీ స్టారర్ సినిమా చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై గోపీచంద్ క్లారిటీ కూడా ఇచ్చారు.

దర్శకుడు టీ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చారు గోపీచంద్. ఫస్ట్ సినిమాలో హీరోగా అవకాశం దక్కినా.. ఆ తర్వాత నిజం, జయం, వర్షంలో విలన్ రోల్స్చేసి స్టార్ స్టేటస్దక్కించుకున్నాడు. ఆ తర్వాత హీరోగా చేస్తున్నాడు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు గోపీచంద్.

ఈ టీవీలో ప్రసారమయ్యే ‘అలీతో సరదాగా’ సీజన్ 2గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇందులో అలీ ఫస్ట్ గెస్ట్ గోపీచంద్ కానున్నాడు. దీనికి సంబంధించిన ప్రొమోను ఇటీవల ఈటీవీ రిలీజ్ చేసింది. ప్రస్తుతం గోపీచంద్ ‘భీమా’ అనే సోషియో ఫాంటసీలో పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు. మార్చి 8న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ప్రమోషన్స్లో జోరు పెంచిన గోపీచంద్వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

ప్రొమోలో ప్రభాస్తో సినిమా గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘మీ ఇద్దరూ కలిసి సినిమా వార్తలు వచ్చాయి. మా దగ్గర పోస్టర్ కూడా ఉంది’ అని అలీ ప్రశ్నించగా.. గోపీచంద్ నవ్వుతూ ‘మసాజ్ తాయి మసాజ్’ అంటూ కామెంట్ చేశాడు. గోపీచంద్ ఎంతో మందిని ఉచితంగా చదివిస్తున్నాడని, ఆ విషయం బయట ఎవరకీ తెలియదని ఎందుకని? అలీ ప్రశ్నించగా.. చెప్పుకోవడం ఇష్టముండదని గోపీచంద్ చెప్పారు.

ఇక ఫస్ట్ క్వశ్చన్ కు సమాధానంగా ‘నేనైతే ప్రభాస్తో సినిమా చేయడానికి రెడీ. భవిష్యత్లో అవుతుంది. ఎలాంటి సినిమానో, కథో చెప్పలేను. మా ఇద్దరికి కూడా కలిసి చేయాలని ఉంది. మంచి సినిమాతో వస్తాం’ అని చెప్పారు. ఈ ‘అలీతో సరదాగా సీజన్ 2’ షో మంగళవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 5వ తేదీ టెలికాస్ట్ అవుతుందని తెలుస్తోంది.

Alitho Saradaga Latest Promo | Season-2 | Gopichand (Actor) | 5th March 2024 | Every Tuesday @9:30pm

Exit mobile version